ETV Bharat / state

ఇంత పొడవైన విద్యార్థిని మీరెప్పుడైనా చూశారా? - ఇతని ముందు నిచ్చెన కూడా కురచే! - STORY ON THE TALLEST STUDENT

6 అడుగుల 8 అంగులాల పొడవుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విద్యార్థి - పాఠశాలలో అందరికంటే పొడవుగా ఉండటంతో గుర్తింపు

story on the tallest student Hemanth
story on the tallest student Hemanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 2:20 PM IST

Story On The Tallest Student Hemanth : ఆ విద్యార్థి వయస్సు 15ఏళ్లు. ఊహించని ఎత్తు పెరిగాడు. ఆ ఎత్తే తనకు గుర్తింపు తెస్తోందంటున్నాడు ఆ విద్యార్థి. ఇంతకీ ఆయన ఎలాగా ఉంటాడనేగా మీ సందేహం. ఆలస్యం దేనికి చదివేయండి మరి.

ఆదిలాబాద్‌ పట్టణం బొక్కలగూడ కాలనీకి చెందిన వినోద్‌-సుజాత దంపతుల పెద్ద కుమారుడు వన్నెల హేమంత్‌. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఆరడుగుల ఎనిమిది అంగుళాల పొడవుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాధారణంగా 14-15ఏళ్ల వయస్సులో అబ్బాయిలు 5 నుంచి 5.7అడుగులు ఉంటారు. కానీ హేమంత్‌ మాత్రం అనూహ్యంగా పెరిగాడు.

అందరూ నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు : తనను చూసి అంతా సెల్ఫీలు తీసుకుంటున్నారని హేమంత్‌ అంటుండగా ఆయన స్నేహితుడిగా ఉండటం తమకూ గర్వంగా ఉందని సహచరులు చెబుతున్నారు. ధనంజయ్‌, సహచర విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆదిలాబాద్‌ పాఠశాలలో అందరికంటే పొడుగ్గా ఉండటంతో అంతా హేమంత్‌ చుట్టూ చేరి సందడి చేస్తున్నారు సహచరవిద్యార్థులు. కుమారుడికి తన పోలికే వచ్చిందని హేమంత్‌ తల్లి సుజాత మురిసిపోతుండగా పాఠశాలలో క్రమశిక్షణ ఉన్న విద్యార్థి అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

బడిలో, ఇంటిపక్కన సజ్జల పైన ఏదైనా వస్తువుంటే తననే పిలుస్తారని హేమంత్ చెబుతున్నాడు. స్కూల్​ యూనిఫాం సరిపోకపోవడంతో సివిల్​ డ్రైస్​లోనే వస్తున్నట్లుగా తెలిపాడు. కాళ్లు పొడవుగా ఉండటం వల్ల సైకిల్​ తొక్కడం కష్టంగా ఉందని హేమంత్​ అన్నాడు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోందని అంటున్నాడు. బాగా చదివితే పోలీస్​గా ఉద్యోగం వస్తుందని టీచర్లు ప్రోత్సహిస్తున్నట్లుగా హేమంత్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.