ETV Bharat / business

ఐపీఎల్​ లవర్స్​కు బిగ్​షాక్​ - ఇకపై మ్యాచ్​లు చూడాలంటే డబ్బు కట్టాల్సిందే! - JIOHOTSTAR SUBSCRIPTIONS PLANS

-డిస్నీ+ హాట్‌స్టార్‌, జియో సినిమా విలీనం -ఫ్రీగా ఐపీఎల్​ మ్యాచ్​లు చూసే అవకాశం లేదు

JioHotstar Streaming Subscriptions Plans
JioHotstar Streaming Subscriptions Plans (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 2:12 PM IST

JioHotstar Streaming Subscriptions Plans: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ -2025 మొదలుకానుంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్​ లవర్స్కు జియో బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఐపీఎల్​ మ్యాచ్​లను ఫ్రీగా చూడలేరని ప్రకటించింది. ఐపీఎల్​తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. అన్ని ICC టోర్నమెంట్‌ల హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ కలిగి ఉంది. ఈ రెండూ ఇటీవల విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో ఇకమీదట క్రికెట్​ మ్యాచ్‌లన్నింటినీ జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. కానీ అందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సిందేనని సంస్థ ప్రకటించింది. ఆ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ వివరాలు ఉలా ఉన్నాయి.

విలీనంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ ఒకే వేదికపైకి వచ్చాయి. దీన్ని "జియో హాట్‌స్టార్‌" అని పిలుస్తున్నారు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లోని కంటెంట్‌ అంతా ఒకేచోట వీక్షించొచ్చు. ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ రూ.149 నుంచి ప్రారంభమవుతున్నాయి.

  • మొబైల్‌ ప్లాన్‌ (యాడ్‌- సపోర్టెడ్‌ ప్లాన్‌) ప్రారంభ ధర రూ.149. ఇది 3 నెలల వ్యాలిడిటీతో ఉంటుంది. ఇక ఏడాదికి చూస్తే వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.499గా నిర్ణయించారు. ఈ ప్లాన్ల ద్వారా కేవలం ఒక మొబైల్‌లో మాత్రమే కంటెంట్‌ చూసే అవకాశం ఉంటుంది.
  • రెండు డివైజ్‌లకు సపోర్ట్‌ చేసేలా రెండు ప్లాన్లను (యాడ్‌- సపోర్టెడ్‌ ప్లాన్‌) జియోహాట్‌స్టార్‌ తీసుకొచ్చింది. మూడు నెలల వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌ ధర రూ.299 ఉండగా, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.899గా ఉంది.
  • యాడ్స్​ లేకుండా కంటెంట్‌ వీక్షించాలనుకొనేవారి కోసం జియోహాట్‌స్టార్‌ రెండు ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ నెలకు రూ.299తో ప్రారంభమవుతుంది. మూడు నెలల వ్యాలిడిటీ కలిగిన ప్రీమియం ప్లాన్‌ ధర రూ.499 ఉండగా, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.1499 ఉంది. ఈ ప్రీమియం ప్లాన్లతో నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించొచ్చు.

ఇక ఇప్పటి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించిన అభిమానులకు ఆ అవకాశం పూర్తిగా లేనట్లే. హాట్‌స్టార్‌ + జియో కలిసి జియోహాట్‌స్టార్‌ పేరిట విలీనం నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూడటం సాధ్యం కాదు. అందుకోసం కనీస ప్లాన్‌ రూ. 149తో సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఒకటే యాప్‌: జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ కలిపి జియో హాట్‌స్టార్‌గా అవతరించింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌ యాప్‌ను వినియోగిస్తున్న వారు, యాప్‌ అప్‌డేట్ చేసుకుంటే అది జియో హాట్‌స్టార్‌గా మారుతుంది. ఇప్పటికే హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటే రాబోయే 3 నెలల పాటు వారికి పాత రేట్లే కొనసాగుతాయి. జియో సినిమా యాప్‌నకు వెళితే అక్కడి నుంచి జియో హాట్‌స్టార్‌ యాప్‌కు రీడైరెక్ట్‌ అవుతుంది. ఒకవేళ జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటే వారు ఆటోమేటిక్‌గా జియోహాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు మారుతారు.

IPL 2025 అప్డేట్- ఈసారి టోర్నీ 2 నెలలకు పైనే!

ఇకపై ఆండ్రాయిడ్​ ఫోన్స్​​లోనూ 'యాపిల్ టీవీ' కంటెంట్ - ఇలా చూసి ఎంజాయ్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.