AP Cabinet about Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన రాష్ట్రమంత్రి వర్గ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఆమోద ముద్ర వేశారు. దీపం పథకం కింద ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. దీపావళి నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. దానితోపాటు ఉచిత ఇసుక విధానంలోనూ సినరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. నగదు చెల్లించి కొనుగోలు చేస్తే 48 గంటల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారిగా మూడు సిలిండర్లు కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో ఉచిత సిలిండర్‌కు 900 కోట్ల రూపాయల చొప్పున మొత్తం మూడు సిలిండర్లకు ఏటా ప్రభుత్వానికి రూ.2700 కోట్లు భారం పడుతుందని ఏపీ మంత్రులు వెల్లడించారు.
ఎవరి ఇసుక వారు తీసుకోవచ్చు : ఉచిత ఇసుక విధానంలో సీనరేజి ఛార్జీల రద్దు వల్ల ఏపీ ప్రభుత్వంపై భారం పడుతుందని అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు ఎంత నష్టం వచ్చినా భరిద్దామని ఏపీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మంత్రులతో అన్నారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు సైతం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యే చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు ఏపీ మంత్రులకు ఆదేశించారు. ఆలయాల్లో కమిటీలలో బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు సైతం చోటు కల్పిస్తూ సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శారదాపీఠానికి షాక్ : శారదా పీఠం భూ కేటాయింపులు రద్దుకు ఆమోద ముద్ర వేసింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేాయలని సమావేశం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ఏపీ జూన్ 2న విడిపోయిన తేదీపైనా సైతం చర్చ జరిగింది. రెండు నెలల్లో అభివృద్ధి పట్టాలెక్కనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలో మంగళవారం డ్రోన్ షో అద్భుతంగా జరిగిందంటూ మంత్రివర్గం ప్రశంసించింది.
45 నిమిషాల్లో హైదరాబాద్ టు విజయవాడ - విమానంలో మాత్రం కాదు- మరి ఎలాగంటే?