ETV Bharat / state

'ఉద్యోగం సంగతి తర్వాత - ముందు ట్రేడింగ్ చెయ్' - మాయగాళ్ల ఉచ్చులో ఆ 2 గ్రామాలు - DCP KAVITHA ABOUT ONLINE SCAMS

హైదరాబాద్​లో నమోదవుతున్న ట్రేడింగ్​ మోసాల కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి - సైబర్​ మోసగాళ్లకు యువత ఏజెంట్లుగా మారుతున్నట్లుగా గుర్తింపు

Cyber Crime DCP Kavitha About Online Scams
Cyber Crime DCP Kavitha About Online Scams (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 1:25 PM IST

Cyber Crime DCP Kavitha About Online Scams : పక్కింటి అబ్బాయిని చూడు. చదువు అయిపోయింది. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఫలానా వాళ్ల అమ్మాయిని చూడు ఇన్ని లక్షల జీతం. సాధారణంగా ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి అందిరికీ ఎదురయ్యే అనుభవం ఇది. కానీ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఉన్న ఆ గ్రామం మాత్రం ఇందుకు భిన్నం. గ్రామంలో అధిక శాతం మంది వారి పిల్లలను ట్రేడింగ్ చేయమని, డబ్బులు సంపాదించమని ఒత్తిడి చేస్తున్నారు. ఓ కేసు దర్యాప్తులో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు, అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు.

ఆ ఊర్లో ప్రతి ఇంట్లో ట్రేడింగ్​ చేస్తుంటారట - పోలీసుల దర్యాప్తులో షాకింగ్​ విషయాలు! (ETV Bharat)

సైబర్​ మోసగాళ్లకు ఏజెంట్లుగా : హైదరాబాద్​లో నమోదవుతున్న ట్రేడింగ్ మోసాల కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్ మోసాల దర్యాప్తులో భాగంగా బ్యాంకు లింకులను పరిశీలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ నుంచి అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కోదాడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో పెద్దఎత్తున యువతీయువకులు సైబర్ మోసగాళ్లకు ఏజెంట్లుగా మారినట్టు నిర్ధారించారు.

సైబర్​ కేటుగాళ్ల ఉచ్చులో 2 గ్రామాలు : కొంతమంది యువత బ్యాంకు ఖాతాలను సైబర్​ కేటుగాళ్లు ఉపయోగించుకుంటున్నట్లుగా సైబర్​ క్రైం పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే ఖాతాల్లోకి చేరిన సొమ్మును క్రిప్టోగా మార్చి తాము సూచించిన విదేశీ ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తుండటంతో ఇతరుల పేర్లతో అదనంగా మరికొన్ని బ్యాంకు ఖాతాలు ప్రారంభించి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 2-3 గ్రామాలు మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు గుర్తించారు పోలీసులు. గుర్తించిన ఇద్దరు నిందితులకు నోటీసులిచ్చారు.

"కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త కొద్దికాలం క్రితం మరణించాడు. దీంతో బిడ్డల బాధ్యతను భార్య తీసుకుంది. పెద్ద కుమార్తెకు వివాహం చేసేందుకు అప్పులు చేశారు. రెండో కుమార్తె హైదరాబాద్​లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. కొంతకాలంగా ఊళ్లో చాలా మంది యువతీయువకులు స్టాక్ ​మార్కెట్​లో పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారనే విషయం ఆమెకు తెలిసింది. దీంతో బీటెక్​ చదువుకుంటున్న కుమార్తెను కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయమంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. మొదట్లో వద్దని వారిస్తూ వచ్చిన కుమార్తె, చివరకు అమ్మ మాటకు తలొగ్గింది. వేసవి సెలవులకు ఇంటికెళ్లిన సమయంలో ట్రేడింగ్ ప్రారంభించింది. అక్కడ జరిగే లావాదేవీలపై కమీషన్ రావటంతో ఆమె తన బంగారం విక్రయించి, రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు సహకరించింది" - కవిత, సైబర్ క్రైం డీసీపీ

అదే గ్రామానికి చెందిన మరో యువకుడు అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు. అతడి తండ్రి కూడా స్టాక్ మార్కెట్లోకి దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చదువుకొని ఇంటి వద్దనే ఉంటున్న కుమారుడిపై ఒత్తిడి తెచ్చాడు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటామని తెలియక బ్యాంకు ఖాతాలివ్వటం, ఇతరులతో పెట్టుబడులు పెట్టించి మోసం చేస్తున్నామని గుర్తించలేకపోతున్నారు. దీనిపై అక్కడి గ్రామాల్లో అవగాహన కల్పించి, మాయగాళ్ల చెర నుంచి బయటపడేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

మహానగరిలో మారిన నేరాల తీరు - డిజిటల్​ అరెస్టు పేరుతో సరికొత్త మోసాలు

ఈ ఒక్క సూత్రం పాటించారంటే - మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.