Balakrishna Padma Bhushan : నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం శనివారం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కళారంగంలో 30 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణను కేంద్రం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ క్రమంలో బాలయ్యకు పాన్ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
'ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు సినిమా రంగానికి చేసిన అసమానమైన కృషి, అవిశ్రాంత ప్రజా సేవకు ఈ గుర్తింపు ఓ నిదర్శనం' అని ఎన్టీఆర్ ట్వీట్ షేర్ చేశారు. 'పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్' అని నందమూరి కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
- పద్మభూషణ్, బాలయ్య బాబులకు అభినందనలు. సినిమా, సమాజానికి ఆయన చేసిన దాతృత్వ సేవకు ఆయనకు దక్కిన గౌరవం- రవితేజ, హీరో
- పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు, ఈ సముచిత గుర్తింపు సినిమా, కళ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావాన్ని తెలుపుతుంది- మహేశ్ బాబు, హీరో
- ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్యకు అభినందనలు. సినిమా రంగంపై మీ అమోఘమైన ప్రభావం, ప్రజాసేవ పట్ల మీ అంకితభావానికి ఇది సముచిత గౌరవం- దగ్గుబాటి వెంకటేశ్, హీరో
- భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. సినిమా, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది- మంచు విష్ణు, మా అధ్యక్షుడు
- మా లెజెండ్ 'పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ' సర్‌కు అభినందనలు- సందీప్ రాజ్, కలర్ ఫొటో డైరెక్టర్
- ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు అభినందనలు. సినిమా, రాజకీయం, సామాజిక సేవకు ఆయన చేసిన కృషికి ఇది ఒక సముచిత గౌరవం. మన "మహారాజ్" #NBKకు శుభాకాంక్షలు- బాబీ, డైరెక్టర్
- అన్‌స్టాపబుల్ బాలయ్య, కళారంగానికి చేసిన అద్భుతమైన కృషికి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా ప్రియమైన నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు- నాగవంశీ, నిర్మాత
- ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న మై బాలా బ్రో కు అభినందనలు, లవ్ యూ- విష్వక్ సేన్, హీరో
- వన్ అండ్ ఓన్లీ గాడ్ ఆఫ్ మాసెస్. అప్పుడు, ఇప్పుడ, ఎప్పుడూ బాలయ్య అన్‌స్టాపబుల్, జై బాలయ్య- తమన్, మ్యూజిక్ డైరెక్టర్