Turkiye Tourism Promotion Meet : తుర్కియే దేశంలోని పర్యటిస్తున్న దేశాల్లో భారతీయులు ముందు వరుసులో ఉన్నారని గత ఏడాది 3లక్షల30వేల మంది పర్యటించారని ఆ దేశ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ యల్మాన్ ఓకాన్, సంస్కృతి పర్యాటక మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ గోజెట్ అన్నారు. ఈ ఏడాది 4లక్షల భారతీయ పర్యాటకులు పర్యటిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ రెండో ఎడిషన్‌లో భాగంగా 3వ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన వారు తుర్కియే దేశంలోని పర్యాటక సాంస్కృతిక ప్రదేశాలు అక్కడి అవకాశాలు వారు అందించే సహకారం గురించి వెల్లడించారు.
తుర్కియే పర్యాటకప్రదేశాల గురించి వివరణ : సినిమా చిత్రీకరణకు, హనీమూన్ కోసం, కుటుంబ సభ్యులంతా తమ దేశానికి రావాలని తుర్కియే పర్యాటక ప్రతినిధులు కోరారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు మొదలు హోటల్స్ భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సాంస్కృతిక, విద్య, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయని వారిరువురు వెల్లడించారు.
తుర్కియే దేశానికి చెందిన టూరిజం ప్రమోషన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ వారి సిక్స్ సిటీ ఇండియా డెస్టినేషన్ ప్రమోషన్ ఈవెంట్‌కు ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పర్యాటక రంగ నిపుణులు, హోటల్స్, రవాణా రంగానికి చెందిన పలువురు ఏజెంట్‌లు సమావేశమై చర్చలు జరిపారు. మన దేశం నుంచి వెళ్లేందుకు తుర్కియే మంచి ప్రదేశమని టూరిజం అండ్ ట్రావలర్ నిర్వాహకురాలు శిల్ప తెలిపారు. మన దేశ సంస్కృతికి చెందిన హోటల్స్ పదుల సంఖ్యలో అక్కడ ఉన్నాయని వెల్లడించారు.
తుర్కియే గురించి : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించే గమ్యస్థానంగా తుర్కియే ప్రసిద్ధి పొందింది. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైన నాగరికతలు, సంస్కృతి, సంప్రదాయాలు. గత రెండు దశాబ్దాల కాలంలో తుర్కియేలో పర్యాటక రంగంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం ఆర్ట్ అండ్ ఫ్యాషన్ రంగంలో చాలా విశేషతను కలిగియుంది.
హైదరాబాద్ టూ ఉత్తరాఖండ్ - దేవభూమికి IRCTC సూపర్ ప్యాకేజీ - దేశ రాజధానినీ చుట్టేయొచ్చు!
ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - అయితే ఈసారి తెలంగాణ 'అరకు' వెళ్లి రండి!