Afghanistan vs England : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. 326 పరుగుల లక్ష్యఛేదనలో 317 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమితో సెమీస్ రేసు నుంచి ఇంగ్లీష్ జట్టు నిష్క్రమించింది.
అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌కు 326 పరుగులు టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్‌గా వచ్చిన ఇబ్రహీం జద్రాన్ (177) అద్భుతంగా ఆడి భారీ సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. చివర్లో మహమ్మద్ నబీ కేవలం 24 బంతుల్లోనే 40 పరుగులతో రాణించాడు. ఆరో వికెట్‌కు వీరు కేవలం 50 బంతుల్లోనే 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. లివింగ్ స్టరన్ రెండు వికెట్లు పడగొట్టగా- జామా ఓవర్టన్, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.