ETV Bharat / health

కొవ్వు కరిగి సిక్స్ ప్యాక్ కావాలా? ఖర్చు లేకుండానే ఈజీగా వస్తుందట! - HOW CAN I EXERCISE WITH NO MONEY

-పెద్దగా ఖర్చు లేకుండానే కండలు పెంచుకోవచ్చట! -వాకింగ్, బాడీ వెయిట్‌ వ్యాయామాలతో ఎంతో లాభం

How can I Exercise with No Money
How can I Exercise with No Money (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 24, 2025, 4:03 PM IST

How can I Exercise with No Money: మీరు ఫిట్​గా, హెల్దీగా ఉండాలని చూస్తున్నారా? ఇంకా సిక్స్ ప్యాక్ కావాలని ఉందా? కానీ ఇందుకోసం రకరకాల పరికరాలు, ఉత్పత్తులను కొనక తప్పదేమో అని అనుకుంటారు. వాటి ధరలను చూసి చాలా మంది భయపడుతుంటారు. అసలు కసరత్తు చేయడమే కష్టం అనుకుంటే ఇంత డబ్బులు వెచ్చించాలా అని ఆలోచిస్తుంటారు. ఇకపై మీరు ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్దగా ఖర్చు లేకుండానే చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉచిత మార్గాలు: లాంటి ఖర్చు లేని అత్యుత్తమ వ్యాయామం వాకింగ్. ఇంకా వేగంగా నడిచే బ్రిస్క్‌ వాక్‌ చేయడం వల్ల గుండె బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో Journal of Sports Science and Medicine ప్రచురితమైన "Walking and cardiovascular health: a systematic review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ప్రకృతిలో నడవడం వల్ల స్థైర్యం పెరిగి.. ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా ఆందోళనను తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. కార్డియో వర్కవుట్లలో రన్నింగ్ చాలా మంచిదని సూచిస్తున్నారు. ప్రతి రోజు 10 నిమిషాల పరిగెత్తడం వల్ల గుండె వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇందుకు ట్రెడ్‌మిల్‌ మీద వేలు ఖర్చు అవసరం లేదని.. మంచి షూస్‌ ఉంటే సరిపోతుందని వివరిస్తున్నారు. ఇవే కాకుండా కొన్ని బాడీవెయిట్‌ వ్యాయామాలు, ఫిట్‌నెస్‌ వీడియోలు వంటివి అతి తక్కువ ఖర్చుతో ప్రేరణని, ప్రయోజనాలను ఇస్తాయని సలహా ఇస్తున్నారు.

కొద్ది ఖర్చుతో: కొంత మందికి జిమ్‌లకు వెళ్లడం ఇష్టం ఉండదు. అలాంటి వారు తక్కువ ఖర్చుతో హోం జిమ్‌ ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరికరాలకు నిర్వహణ వ్యయాలూ ఉండవని.. అలాంటివి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం డంబెల్స్, రెసిస్టెన్స్‌ బాండ్స్, జంప్‌ రోప్స్, కెటిల్‌ బెల్స్, యోగా మాట్‌ ఇంట్లో ఉంటే చాలని సూచిస్తున్నారు. ఇంకా వీటి కొనుగోళ్లపై కొన్ని డిస్కౌంట్‌ సైట్లు, ఈ వాలెట్లు కూపన్లు ఇస్తూంటాయని.. వాటిలో జిమ్‌ మెంబర్‌ షిప్‌లపై ఆఫర్లు ఉంటాయని అంటున్నారు. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల ఆరోగ్య స్కీమ్‌లలో జిమ్‌ మెంబర్‌ షిప్‌లకు, ఫిట్‌నెస్‌ క్లాసులకు రాయితీలు, రీఇంబర్స్‌మెంట్‌ ఇస్తాయని తెలిపారు. బీమా పాలసీల్లో కూడా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు.

బాడీ వెయిట్‌ వ్యాయామాలు: డంబెల్స్, రాడ్స్, వెయిట్స్‌ ఇలా ఏ పరికరాలూ లేకపోయినా.. శరీర బరువు ఆధారంగానే మంచి వ్యాయామాలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కాలిస్తనిక్స్‌ అని పిలుస్తుంటారు. కొందరు వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతుంటారు. కానీ, నిజానికి ఇవి చాలా కష్టమని.. ఒక్కసారి చేసి చూస్తే మీకే తెలుస్తుందని నిపుణలు అంటున్నారు. ఇవన్నీ గుండె వేగాన్ని పెంచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని వివరిస్తున్నారు. వీటిలో ప్రాథమిక వ్యాయామాలతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇవి నడుము పటుత్వాన్ని మెరుగు పరిచి.. కండరాలకు బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయని అంటున్నారు. ఇందుకోసం పుష్‌-అప్స్, ప్లాంక్స్, స్క్వాట్స్, రష్యన్‌ ట్విస్ట్స్, బర్పీస్‌ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లోలా వీటితో త్వరగా ఫలితాలు రావని.. కాస్త ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కానీ మిగతా వ్యాయామాలతో పోలిస్తే వీటితో గాయాల ప్రమాదం ఉండదని తెలిపారు.

చవక మార్గాలెన్నో: మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలంలో ఆసక్తి ఉన్న వారితో కలిసి షటిల్, వాలీబాల్‌ ఆడవచ్చని, వాకింగ్‌ క్లబ్‌లో చేరచ్చని సూచిస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్న ఓపెన్‌ జిమ్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇంకా సమీపంలోని మున్సిపల్, కమ్యూనిటీ జిమ్స్‌లో ఫీజులు చవగ్గా ఉంటాయని.. అక్కడ చేసుకోవచ్చని చెబుతున్నారు.

నెట్‌ వీడియోల గని: ప్రస్తుత ఆధునిక యుగంలో యూట్యూబ్​లో ఉచిత వీడియోలు చూస్తూ వ్యాయామాలు చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫలితంగా పేరొందిన జిమ్‌లలో చేరి వేల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. యూట్యూబ్‌, ఓటీటీలూ యోగా, పైలేట్స్‌ వంటి ఫుల్‌బాడీ వర్కవుట్స్‌ తరగతులను స్ట్రీమింగ్‌ చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇంకా అనేక యాప్స్ మీ వయసు, బరువు, ఎత్తు, అలవాట్లకి తగిన డైలీ వర్కవుట్‌ ప్లాన్‌లను సూచిస్తాయని తెలిపారు.

శిక్షకులు కావాలంటే: క్కరికి కోచ్‌ను పెట్టుకోవడం కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. అందుకే కొద్ది మంది కలసి ఈ ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇవే ఆన్‌లైన్‌ ట్రైనర్లనూ మాట్లాడుకోవచ్చు. వాస్తవానికి ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు పెద్దగా ఖర్చు అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్‌ దుస్తులు, పరికరాలు ఆకర్షణీయంగా కనిపించినా.. ఖర్చు లేని వ్యాయామాలతో వచ్చే ప్రయోజనాలు ఒకటేనని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నల్లద్రాక్షతో గుండె జబ్బులు, క్యాన్సర్​కు చెక్- కానీ వారు మాత్రం ఎక్కువగా తినకూడదట

తినేటప్పుడు ఉప్పు డబ్బాను పక్కనే పెట్టుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించకపోతే ముప్పు తప్పదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.