ETV Bharat / business

2025 మార్చి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - BANK HOLIDAYS IN MARCH 2025

2025 మార్చి నెలలో 10 రోజుల పాటు బ్యాంకులకు సెలవు- ఈ హాలీ డేస్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎలా చేయాలంటే?

Bank holidays
Bank holidays (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2025, 12:45 PM IST

Bank Holidays In March 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2025 మార్చి నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

List Of Bank Holidays In March 2025
2025 మార్చి నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

  • మార్చి 5 (బుధవారం) : పంచాయతీ రాజ్‌ దివస్ సందర్భంగా ఒడిశా, పంజాబ్‌, సిక్కిం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • మార్చి 7 (శుక్రవారం) : చాప్చర్‌ కుట్ పండుగ సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.
  • మార్చి 8 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • మార్చి 14 (శుక్రవారం) : హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు. ఈ రోజు మణిపుర్‌లో యావోసాంగ్‌, బంగాల్‌లో డోల్‌జాత్రా పండుగలు ఉన్నాయి.
  • మార్చి 22 (శనివారం) : బిహార్ డే సందర్భంగా బిహార్‌లోని బ్యాంకులకు సెలవు.
  • మార్చి 23 (ఆదివారం) : భగత్‌సింగ్ వర్థంతి, సహీద్‌ దివస్‌ కూడా ఈ రోజే.
  • మార్చి 25 (మంగళవారం) : డోల్ జాత్రా సందర్భంగా అసోం, బంగాల్‌, జమ్మూకశ్మీర్‌, దిల్లీలో; ధులండి సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులకు సెలవు.
  • మార్చి 28 (శుక్రవారం) : జమాత్-ఉల్-విదా సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో, షబ్‌-ఎ-ఖద్ర్‌ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని బ్యాంకులకు సెలవు.
  • మార్చి 30 (ఆదివారం) : ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో ఉగాది జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వా చేసుకుంటారు.
  • మార్చి 31 (సోమవారం) : ఈద్‌-ఉల్-ఫితర్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : 2025 మార్చి​​ ​నెలలో 10 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.