ICC ODI Rankings : ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్-5కి చేరుకున్నాడు. ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక బాబర్ అజామ్, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే కొనసాగుతుండగా, కేఎల్ రాహుల్ రెండు స్థానాలు మెరుగై 15వ ర్యాంక్‌కు చేరుకున్నారు.
మరోవైపు, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రషీద్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్ ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని ప్రస్తుత జట్టులో రాణిస్తున్న టీమ్ఇండియా స్టార్ మహ్మద్ సిరాజ్ మాత్రం రెండు స్థానాలకు దిగజారి 12వ ర్యాంకుకు పడిపోగా, షమి ఒక స్థానం మెరుగై 14వ ర్యాంకులో నిలిచాడు.
ఇదిలా ఉండగా, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఈ సారి ఎటువంటి మార్పులు లేవు. అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ నబీ టాప్ పొజిషన్లో ఉండగా, రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మైకేల్ బ్రాస్‌వెల్ ఏకంగా 26 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
సెంచరీ వల్లే!
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు విరాట్ అద్భుత శతకంతో సమాధానమిచ్చాడు. 100 (116 బంతుల్లో) అదరగొట్టాడు. విరాట్‌కు వన్డేల్ల ఇది 52వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 82వ అంతర్జాతీయ శతకం. ఈ లిస్ట్‌లో విరాట్ కంటే ముందు సచిన్ తెందూల్కర్ (100 సెంచరీలు) ఒక్కడే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లోనే విరాట్ మరో ఘనత సాధించాడు. ఇప్పుడా స్కోరే తన ర్యాంకింగ్స్ మెరుగుపడేందుకు దోహదపడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంలో విరాట్ సెంచరీతో కీలక పాత్ర పోషించింది. వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన విరాట్ మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 82వ అంతర్జాతీయ శతకం.
'విరాట్ కోహ్లీయే రియల్ 'కింగ్'- బాబర్ అజామ్ కాదు'- పాక్ మాజీ ప్లేయర్