ETV Bharat / health

మీ బట్టతలకు కారణం ఆ ఒక్కటేనట! - అంతా అదే చేస్తోంది - త్వరగా సెట్​ చేసుకోండి! - HAIR FALL WITH SELENIUM

- శరీరంలోని ఒకే ఒక్క ఖనిజంతో జుట్టు వేగంగా రాలిపోతుందంటున్న నిపుణులు

Selenium For Hair Fall
Selenium For Hair Fall (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 7:12 PM IST

Selenium For Hair Fall : అప్పటి వరకూ అడవిలా గుబురుగా ఉన్న జుట్టు కాస్తా ఉన్నట్టుండి కుప్పలు కుప్పలుగా ఊడిపోతూ ఉంటుంది! కారణం ఏంటో అర్థం కాదు. ఏవేవో షాంపూలు వాడుతారు. ఇంకేవో పసర్లు పూస్తారు. ప్యాకులు వేస్తారు. అయినా గానీ జుట్టు ఊడిపోవడం ఆగదు. మగాళ్లలో బట్టతల వచ్చేదాకా, ఆడవాళ్లలో పిలక జడ వచ్చేదాకా ఆగనే ఆగదు! ఈ పరిస్థితికి రకరకాల కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే, తాజాగా మరో కొత్త విషయం బయటపడింది. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి ఒక ఖనిజం కారణం అవుతుందట. అదే "సెలీనియం". మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

బాడీకి అత్యంత కీలకం :

సెలీనియం అనేది శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజం. ఇది మాంసం, గుడ్లు, చిక్కుళ్లు, పొట్టు ధాన్యాలైన గోధుమలు, పొద్దు తిరుగుడు గింజలు, దంపుడు బియ్యం, పప్పులు, పాలకూర, పుట్ట గొడుగులు, పాలు, పెరుగు, అరటి పండ్లు, జీడిపప్పు వంటి వాటినుంచి లభిస్తుంది. ఇంకా మట్టిలో, నీటిలోనూ ఉంటుంది. దీని అవసరం శరీరానికి తక్కువే. కానీ మొత్తం ఆరోగ్యంలో అత్యంత కీలకం. థైరాయిడ్‌ రాకుండా, పునరుత్పత్తి సక్రమంగా ఉండేలా చూస్తుంది. డీఎన్‌ఏలోనూ కీలకం. కణాలు దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది.

ఎక్కువైతే మాత్రం అంతే :

శరీరంలో అంత ముఖ్యమైన సెలీనియం బాడీలో మోతాదులో మాత్రమే ఉండాలి. మించితే మాత్రం చాలా పెద్ద సమస్యలు వస్తాయి. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. చర్మ సమస్యలు వస్తాయి. నరాల బలహీనత మొదలవుతుంది. గోళ్లు పెలుసుగా మారి విరిగిపోతుంటాయి. ఇలా పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వెంట్రుకలపై సెలీనియం దాడి నేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కుదుళ్లను బలహీనపరుస్తుందట. దాంతో జుట్టు వేగంగా రాలిపోతుందట.

మహారాష్ట్రలో వెలుగులోకి :

ఇటీవల మహారాష్ట్ర బుల్ఢాణా డిస్ట్రిక్​లో కొన్ని ఊళ్లలోని జనాలకు ఉన్నట్టుండి భారీగా జుట్టు ఊడిపోయింది. ఈ ఘటన తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితికి గోధుమల్లోని అధిక సెలీనియమే కారణమని నిపుణులు అనుమానిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్‌రావు బావస్కర్‌ నెల పాటు పరిశోధన చేస్తే, స్థానికులు దిగుమతి చేసుకుని తిన్న గోధుమల్లో సెలీనియం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బాధితుల రక్తం, జుట్టు శాంపిల్స్​ పరిశీలిస్తే వాటిలోనూ సెలీనియం ఎక్కువగా ఉన్నట్లు తేలిందట. దీనికి తోడు జింక్‌ తక్కువగా ఉన్నట్లు తేలిందట. దీంతో జుట్టు అధికంగా రాలడానికి ఇవే కారణమని భావిస్తున్నామని బావస్కర్ చెప్పారు. కాబట్టి జింక్, సెలీనియం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మీ ఇంట్లోని ఈ ఒక్క ఆకు - అల్సర్​, షుగర్​కు అద్భుత మెడిసిన్! - ఇన్నాళ్లూ తెలియలేదు!

వారానికి కనీసంగా పెరుగు తింటే - పెద్ద పేగు క్యాన్సర్​ ముప్పు అడ్డుకోవచ్చట! - కీలక పరిశోధన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.