ETV Bharat / offbeat

అమ్మమ్మల కాలం నాటి రాగి అంబలి - కూల్​ డ్రింక్స్​ పనికేరావు! - ఈజీగా చేసుకోండిలా! - HOMEMADE SUMMER DRINKS

- సమ్మర్​లో అద్భుతమైన హెల్దీ డ్రింక్ - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం

SUMMER DRINKS
Healthy Summer Drinks (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 12:30 PM IST

Healthy Summer Drinks in Telugu : రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో ఒంటిని చల్లబరుచుకునేందుకు చాలా మంది కార్బొనేటెడ్ కూల్​ డ్రింక్స్​ ఎక్కువగా తాగుతుంటారు. కానీ, అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, మీకోసం ఒక హెల్దీ డ్రింక్ తీసుకొచ్చాం. ఈ డ్రింక్​ తీసుకోవడం ద్వారా, శరీరానికి తక్షణమే శక్తి అందుతుంది. ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఈ హెల్దీ డ్రింక్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే, అమ్మమ్మల కాలం నాటి రాగి అంబలి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

రాగి అంబలి :

కావాల్సిన పదార్థాలు :

  • రాగి పిండి - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్మా రవ్వ - 2 టీ-స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పెరుగు - పావు నుంచి అర కప్పు వరకు

తయారీ విధానం :

  • ముందుగా ఒక చిన్నపాటి మిక్సింగ్ బౌల్​లో రాగిపిండిని తీసుకోవాలి. ఆపై అందులో అర కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే, దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి కలిపి పులియబెట్టుకోవాలి.
  • అంటే ఈ పిండిని కనీసం 8 నుంచి 10 గంటపాటు పులియబెట్టుకోవాలి. పిండి ఎంత బాగా పులిస్తే అంబలి అంత రుచికరంగా వస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే, ఇలా నానబెట్టి చేసుకోవడం వల్ల పోషకాలూ ఎక్కువగా లభిస్తాయి.
  • 10 గంటల పాటు నానబెట్టుకున్నాక మూత తీసి పిండిని చూస్తే పైన వాటర్ తేలి, కింద పిండి పేరుకొని కనిపిస్తుంది.
  • అనంతరం అందులోని వాటర్​ని మరో బౌల్​లోకి వడకట్టుకోవాలి. దీన్నే కలి అంటారు. ఈ వాటర్​ని పారబోయకుండా ఇందులో మరుసటి రోజుకి రాగిపిండిని నానబెట్టుకుంటే అంబలి మరింత రుచికరంగా, పోషకాలతో నిండి ఉంటుంది.

సమ్మర్ స్పెషల్ : నోరూరించే మునక్కాయ బిర్యానీ - ఇలా ప్రిపేర్​ చేయండి - కుమ్మేస్తారంతే!

  • ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టుకొని 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్(దాదాపు 650ఎంఎల్) పోసి మరిగించుకోవాలి. నీళ్లు కాస్త వేడయ్యాక అందులో నానబెట్టి వాటర్ వడకట్టిన రాగి పిండిని మరోసారి కలిపి పోసుకోవాలి.
  • పిండిని వాటర్​లో యాడ్ చేసుకున్నాక గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. లేదంటే పిండి ముద్ద కట్టేస్తుందని గుర్తుంచుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలిపి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆపై తగినంత ఉప్పు వేసుకొని కలిపి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే రాగి జావ మంచిగా ఉడికి కాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్​లో స్టౌ ఆఫ్ చేసుకొని కాస్త చల్లార్చుకోవాలి.
  • ఈ లోపు ఒక చిన్న బౌల్​లో పెరుగును తీసుకొని విస్కర్ సహాయంతో గడ్డలు లేకుండా చిలుక్కోవాలి. ఆపై అందులో అరకప్పు వరకు వాటర్ వేసుకొని చిక్కని మజ్జిగ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆ మజ్జిగను కాస్త చల్లారిన రాగి జావలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్​లో ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం దాన్ని గ్లాసులలోకి తీసుకొని పైన కొద్దిగా సన్నని ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, టేస్టీ అండ్ హెల్దీ "రాగి అంబలి" రెడీ!
  • మీకు కాస్త పుల్లగా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తాగితే చాలా రుచికరంగా ఉంటుంది.

సమ్మర్​ స్పెషల్​ : పుచ్చకాయతో​ అద్దిరిపోయే ఐస్ క్రీమ్ - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.