CM Revanth Reddy on Kedar Death in Dubai : కేటీఆర్ వ్యాపార భాగస్వామి టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్, కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి, కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానస్పద మృతులపై ఆయన ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పదంగా చనిపోయారని, ఆయన ర్యాడిసన్బ్లూ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడని తెలిపారు.
ఇప్పుడు ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు : కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, ఆ కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందారని అన్నారు. అనుమానాస్పద మరణాలపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై, ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు రాకుండా ఏమీ మాట్లాడను సీఎం అన్నారు.
కేదార్ మృతి : టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ మృతి చెందాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఈవెంట్లో పాల్గొనేందుకు కేదార్ అక్కడకు వెళ్లారు. మంగళవారం అతను చనిపోయినట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

భూ వివాదంలో హత్య : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) ఈ నెల 19న దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయనను నరికి చంపారు. ఈయనపై గతంలో భూ వివాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. రాజలింగమూర్తి హత్యకు సంబంధించి పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఎకరం భూమి వివాదమే హత్యకు దారితీసిందని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎకరం భూమికి సంబంధించి ఏ1 నిందితుడైన రేణి గుంట్ల సంజీవ్‌కు, మృతుడు రాజలింగమూర్తికి చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయన్నారు. ఇందులో కొంత భాగం తన పేరు మీద రాయించుకున్నాడంటూ రాజలింగమూర్తిపై సంజీవ్ కక్ష్య పెంచుకుని హత మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ వివరించారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాల అభివృద్ధి : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఓడితే ముక్కు నేలకు రాస్తా - కేసీఆర్, కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్