Hair Damage Treatment at Home: ప్రస్తుతం చాలా మంది జుట్టును స్ట్రెయిట్‌గా, కర్లీగా, అలల మాదిరిగా ఇలా ఎలా పడితే అలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌స్టైలింగ్ టూల్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటి వల్ల జుట్టు అప్పటికప్పుడు అందంగా కనిపించచ్చని.. కానీ వీటి నుంచి వెలువడే అధిక వేడి కారణంగా కుదుళ్లు, జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివర్లు చిట్లిపోవడం, జుట్టు పొడిబారిపోవడం, గడ్డి లాగా తయారవడం, తెగిపోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఇలా వేడి కారణంగా దెబ్బతిన్న జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తెచ్చుకోవాలంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు మేలు చేస్తాయని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కొబ్బరి నూనె మాస్క్‌తో!
తేమ కోల్పోయి పొడిబారిన జుట్టును తిరిగి రిపేర్ చేయడానికి కొబ్బరినూనె చక్కటి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించడంతో పాటు వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక విటమిన్ ఇ క్యాప్సూల్, కొద్దిగా షియా బటర్ వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలట. ఇలా తరచూ చేయడం వల్ల వేడి వల్ల డ్యామేజ్ అయిన జుట్టు తిరిగి తేమను సంతరించుకుంటుందని వివరిస్తున్నారు. ఈ చిట్కా జుట్టు రాలడాన్ని తగ్గించడంలోనూ సమర్థంగా పనిచేస్తుందని వెల్లడిస్తున్నారు. 2011లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Effect of coconut oil on prevention of hair damage" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మీది కర్లీ హెయిరా?
సాధారణంగానే ఉంగరాల జుట్టున్న వారి వెంట్రుకలు పొడిబారినట్లుగా, గడ్డిలాగా కనిపిస్తుంటాయి. అలాంటి వారు తమ జుట్టుకు హీటింగ్ ఉత్పత్తుల్ని వాడితే అది మరింతగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎప్సం సాల్ట్ చక్కటి ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు. ఇందుకోసం కండిషనర్, ఎప్సం సాల్ట్ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని కొద్దిగా వేడిచేయాలని తెలిపారు. అనంతరం షాంపూతో తలస్నానం చేసి ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. ఆపై అరగంట పాటు అలాగే ఉంచుకొని చల్లటి నీళ్లతో కడిగేస్తే సరిపోతుందని తెలిపారు. ఈ చిట్కా వల్ల పొడిబారిన కుదుళ్లు, జుట్టు తిరిగి తేమను సంతరించుకుంటాయని వివరిస్తున్నారు.

కెఫీన్‌తో రిపేర్!
బ్లో డ్రయర్స్, ఇతర హెయిర్ స్టైలింగ్ పరికాల వల్ల జుట్టు చిక్కులుగా అవుతాయి. ఇలాంటి జుట్టును రిపేర్ చేయడం టీ తోనే సాధ్యమని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా కొన్ని తేయాకులు/టీ పొడిని నీటిలో వేసి మరిగించాలని చెబుతున్నారు. ఈ మిశ్రమం చల్లారాక జుట్టు, కుదుళ్లపై నుంచి పోసి ఆ తర్వాత జుట్టుకు టవల్ చుట్టేయాలట. ఇలా ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని అనంతరం చల్లటి నీటితో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ టీ మిశ్రమంలోని కెఫీన్ జుట్టుకు, కుదుళ్లకు సహజసిద్ధమైన తేమను అందిస్తుందని.. ఫలితంగా జుట్టు సిల్కీగా తయారై చిక్కులు కట్టకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పిల్లలకు రైమ్స్, కార్టూన్స్ పెట్టి ఇస్తున్నారా? ఇలా చేస్తే అనేక సమస్యలు వస్తాయట జాగ్రత్త!
సైలెంట్‌గా ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? ఈ టిప్స్ పాటిస్తే ఎక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చట!