ETV Bharat / lifestyle

వీకెండ్ స్పెషల్ : తమిళనాడు ఫేమస్ ఖుస్కా- నాన్ వెజ్ కర్రీలో తింటే సూపర్ టేస్ట్! - HOW TO MAKE KUSKA IN TELUGU

-వీకెండ్​లో ఏం తినాలని ఆలోచిస్తున్నారా? -దీనిని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు

kuska biryani in telugu
kuska biryani in telugu (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 24, 2025, 5:14 PM IST

Kuska Biryani in Telugu: ఈ వీకెండ్​కు ఏదైనా స్పెషల్ రెసిపీ చేయాలని చూస్తున్నారా? అయితే, ఖుస్కా ట్రై చేయండి సూపర్​గా ఉంటుంది. ఇది రాయలసీమ ముఖ్యంగా తమిళనాడులో చాలా ఫేమస్. అక్కడ ఏ ఫంక్షన్​లోనైనా ఇది తప్పక ఉండాల్సిందే. ఇంకా చిన్న చిన్న బండ్లపై కూడా దీనిని అమ్ముతుంటారు. ఇది రైతా, నాన్ వెజ్ కర్రీస్​తో చాలా రుచిగా ఉంటుంది. ఈ ఖుస్కా ఒక రకంగా టమాటో రైస్​లా అనిపించినా.. రుచి, సువాసన భిన్నంగా ఉంటుంది. ఇంకా కొందరు దీనిలో నాన్ వెజ్ వేసి కూడా చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

  • ఒక కప్పు బియ్యం లేదా బాస్మతి (గంటపాటు నానబెట్టినవి)
  • అర కప్పు నెయ్యి
  • ఒక ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిరపకాయ చీలికలు
  • 2 పండిన టమాటాలు
  • అర కట్ట పుదీనా
  • అర కట్ట కొత్తిమీర
  • అర కప్పు పెరుగు
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • ఒక ఇంచు దాల్చిన చెక్క
  • ఒక అనాసపువ్వు
  • చిన్న పలుకు జాజికాయ
  • ఒక బిరియాని ఆకు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఒక టీ స్పూన్ సోంపు
  • రుచికి తగినంత ఉప్పు
  • ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద
  • పావు స్పూన్ పసుపు
  • ఒక టీ స్పూన్ కారం
  • అర టీ స్పూన్ గరం మసాలా
  • ఒక కప్పు నీరు

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్​లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
  • అందులో యాలకలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జాజికాయ, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.
  • అనంతరం జీలకర్ర, సోంపు వేసి వేయించి ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించి అందులో పండిన టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మెత్తగా మగ్గించుకోవాలి.
  • ఇప్పుడు½ కమ్మటి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ నిదానంగా పెరుగులోంచి నెయ్యి పైకి తేలేదాకా ఉడికించుకోవాలి.
  • నెయ్యి పైకి తేలాక కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలిపి.. గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వడకట్టి వేసుకోవాలి.
  • ఆ తర్వాత హై ఫ్లేమ్ మీద నిదానంగా గింజ విరగకుండా ఓ నిమిషం పాటు వేయించుకోవాలి.
  • అనంతరం నీరు పోసి కుక్కర్ మూత పెట్టి కేవలం హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రాగానే దించేసుకోవాలి. (బాస్మతి బియ్యం అయితే కప్ బియ్యానికి కప్ నీరు సరిపోతుంది. • అదే సోనా మసూరి బియ్యం అయితే కప్ బియ్యనికి 1.3/4 నీళ్లు పోయాలి)
  • సుమారు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని.. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి అడుగునుంచి అట్లకాడతో కలిపితే ఘుమఘుమలాడే ఖుస్కా రెడీ!

అన్నంతో అదిరిపోయే 'చిట్టి ఉల్లిపాయ పులుసు'- కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు!

ఈ టిప్స్ పాటిస్తే బిర్యానీ టేస్ట్ అద్దిరిపోతుంది! హోటల్ స్టైల్​లో రావాలంటే ఎలా చేయాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.