Education expert Krishna Prasad Sompally Interview : అమెరికాలో లీగల్‌గా చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అరకొర సమాచారంతో ఆందోళన చెందవద్దని అమెరికాలో విద్యారంగ నిపుణులు కృష్ణ ప్రసాద్ సొంపల్లి అన్నారు. విద్య, ఉపాధి కోసం అమెరికా వచ్చే వారంతా ముందుగా అక్కడి చట్టాలను కూలంకుశంగా తెలుసుకోవాలన్నారు.
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారతీయులు ఇబ్బంది పడుతున్నారన్న వాదన సరికాదన్నారు. విద్య గొప్పతనాన్ని అమెరికన్లు బాగా తెలుసుకున్నారని, అందుకే చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తారని కృష్ణ ప్రసాద్ చెప్పారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు, విద్యా వ్యవస్థపై స్కూల్ కమిటీ మెంబర్‌గా ఎన్నికైన కృష్ణప్రసాద్ సొంపల్లితో ఈటీవీ భారత్ ముఖాముఖి.