CM Revanth Reddy Review On New Flyovers : హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 90 రోజుల్లో డీపీఆర్ తయారు చేసి 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాజెక్టులపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై సుమారు రెండున్నర కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు మూడు ప్రతిపాదనలు సమర్పించారు. వాటికి పలు మార్పులు, చేర్పులు సూచించిన రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో పూర్తి సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు.
మీరాలం బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దండి : మీరాలం బ్రిడ్జిని హైదరాబాద్లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. హైదరాబాద్లో రోడ్ల వెడల్పుపై కూడా పలు సూచనలు ఇచ్చారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి నదీ అభివృద్ధి సంస్థ జేఎండీ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా హైదరాబాద్ నగరాభివృద్ధి - ప్రత్యేకంగా అర్బన్ ట్రాన్స్‌పోర్టు నిధి!
న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ నగర అభివృద్ధి : సీఎం రేవంత్‌రెడ్డి