ETV Bharat / technology

ఒకటికి మించి మరొకటి- పోటాపోటీ ఫీచర్లతో లాంఛ్​కు రెడీగా కిర్రాక్ స్మార్ట్​ఫోన్లు! - UPCOMING SMARTPHONES IN FEB 2025

ఐకూ నుంచి పోకో వరకు అదిరే స్మార్ట్​ఫోన్లు- ఈ ఫిబ్రవరిలో ఎంట్రీ ఇవ్వనున్న టాప్ మోడల్స్ ఇవే!- ఓ లుక్కేయండి మరి!

Upcoming Smartphone Launches in February 2025
Upcoming Smartphone Launches in February 2025 (Photo Credit- Iqoo/ Vivo/ Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 3, 2025, 7:58 PM IST

Upcoming Smartphone Launches in February 2025: ప్రస్తుతం స్మార్ట్​ఫోన్​ ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్​ఫోన్​లు మార్కెట్​లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫిబ్రవరి నెలలో కూడా అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు అనేక కంపెనీలు రెడీ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక స్మార్ట్​ఫోన్ తయారీ కంపెనీలు భారత్​తో పాటు ఇతర దేశాల్లో తమ లేటెస్ట్ మోడల్స్​ను లాంఛ్ చేయబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

1. iQOO Neo 10R: వివో సంబ్​-బ్రాండ్ కంపెనీ ఐకూ భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్​తో 'ఐకూ నియో 10R' అనే కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసేందుకు రెడీ అయింది. వినియోగదారుల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కంపెనీ దీన్ని తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ టీజర్​ను కూడా వివో విడుదల చేసింది. అయితే ఇంకా లాంఛ్ డేట్​ను ప్రకటించలేదు. కానీ ఈ నెలలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.

టిప్​స్టర్ అభిషేక్ యాదవ్ పోస్ట్, దీనిపై వచ్చిన అనేక లీక్స్​ ప్రకారం ఈ ఫోన్ 6400mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్​పై మరిన్ని వివరాలు తీసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

2. Vivo V50 Series: వివో సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను ఇండియన్ మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ 'వివో V50 సిరీస్' పేరుతో ఈ లైనప్​ను ప్రారంభించనుంది. ఈ సిరీస్​లో 'వివో V50', 'వివో V50 ప్రో' అనే రెండు మోడల్స్​ను తీసుకురానుంది. వీటిలో 6000mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాను అందించొచ్చు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. Xiaomi 15 Series: షావోమీ కూడా ఈ ఫిబ్రవరిలో తన కొత్త స్మార్ట్​ఫోన్ సిరీస్​ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. 'షావోమీ 15' పేరుతో ఈ సిరీస్​ను తీసుకురానుంది. కంపెనీ ఈ సిరీస్​లో 'షావోమీ 15', 'షావోమీ 15 ప్రో' అనే రెండు స్మార్ట్​ఫోన్​లను రిలీజ్ చేయనుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ అధికారిక లాంఛ్ తేదీని ప్రకటించలేదు. కానీ ఫిబ్రవరి చివరిలో ఈ ఫోన్ దేశీయ మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది మార్చి 7న భారత మార్కెట్​లో 'షావోమీ 14 సిరీస్'​ లాంఛ్ అయ్యాయి.

4. Realme P3 Pro: రియల్​మీ ఈ ఫోన్​ను ఫిబ్రవరి మూడో వారంలో లాంఛ్ చేయొచ్చు. ఈ ఫోన్ దేశీయ మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కంపెనీ ఈ 'రియల్​మీ P3 ప్రో' స్మార్ట్​ఫోన్ లాంఛ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. లీకైన నివేదికల ప్రకారం ఇది 5000mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి అనేక ప్రతేక ఫీచర్లతో వస్తుంది.

5. Samsung Galaxy A56 5G: శామ్సంగ్ కూడా ఈ నెలలో తన 'A' లైనప్‌లో 'శాంసంగ్ గెలాక్సీ A56 5G' అనే కొత్త ఫోన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. టిప్‌స్టర్ ప్రకారం ఈ ఫోన్‌కు 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్‌ప్లేతో రావచ్చు. అంతేకాక ఇది 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుందని లీక్స్ వచ్చాయి.

6. Samsung Galaxy A36 5G: శామ్సంగ్ తన 'A' లైనప్‌లో రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయొచ్చు. వాటిలో రెండో మోడల్​ ఫోన్ పేరు 'శాంసంగ్ గెలాక్సీ A36 5G' కావచ్చు. నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 6 Gen 3 SoC లేదా స్నాప్​డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించొచ్చు. అదే సమయంలో ఈ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ కోసం Android 15 బేస్డ్ One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించొచ్చు. వీటితో పాటు ఈ ఫోన్‌ 50MP రియర్ కెమెరాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

7. Oppo Find N5 లేదా OnePlus Open 2: ఒప్పో చైనాలో కొత్త ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీన్ని 'ఒప్పో ఫైండ్ N5' అనే పేరుతో లాంఛ్ చేయనుంది. అయితే భారత మార్కెట్​లోకి మాత్రం ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ కొత్త ఫోల్డబుల్ ఫోన్‌గా అంటే 'వన్‌ప్లస్ ఓపెన్ 2'గా రిలీజ్ చేయొచ్చు.

దీని లాంఛింగ్​తో ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్​గా అవతరిస్తుందని కంపెనీ చెబుతోంది. 'ఒప్పో ఫైండ్ N5' పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో ఈ నెలలోనే ప్రారంభించవచ్చు. 5900mAh బ్యాటరీ, 80W వైర్డ్ అండ్ 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో ఇది ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్​పై మరిన్ని వివరాలు తెలుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

8. Realme Neo 7: 'రియల్​మీ నియో 7' స్మార్ట్​ఫోన్ కూడా ఈ ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యేందుకు రెడీగా ఉంది. కంపెనీ ఈ ఫోన్​ను గ్లోబల్​ మార్కెట్​లో లాంఛ్ చేయనుంది. అయితే దీని లాంఛ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇది 6.78 అంగుళాల LTPO స్క్రీన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీని పీక్ బ్రైట్​నెస్ 6000 నిట్స్ కావచ్చు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్, 50MP రియర్ కెమెరా సెటప్, 7000mAh బ్యాటరీ అండ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో రానున్నట్లు తెలుస్తోంది.

9. Asus Zenfone 12 Ultra: ఈ కొత్త ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఆసుస్ కూడా సిద్ధంగా ఉంది. ఇది 6.78 అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED LTPO స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా, 5800mAh బ్యాటరీ అండ్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుందని సమాచారం.

10. Poco F7: పోకో F7 స్మార్ట్​ఫోన్​ కూడా ఈ ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్​ను 'రెడ్‌మీ టర్బో 4 ప్రో 5G' రీబ్రాండెడ్​ వెర్షన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది డైమెన్సిటీ 8400 SoC చిప్‌సెట్, 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ అండ్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ లాంఛ్ డేట్​ను ఇంకా ప్రకటించలేదు.

ఇండియన్ రైల్వే సూపర్ యాప్ వచ్చేసిందోచ్- ఇకపై ఒక్క క్లిక్​తోనే టికెట్ బుకింగ్​తో పాటు అన్ని సేవలు!

శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ మిషన్​లో సాంకేతిక లోపం- మొరాయిస్తున్న NVS-02 శాటిలైట్!

బాల్యం నుంచే స్మార్ట్​ఫోన్- యవ్వనంలో మతి చెడిపోతుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.