Exams Preparation Tips For Students In Telugu : ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉంటే పరీక్షల్లో అందరూ ఒకే రకమైన మార్కులు సాధించలేరు. ఏదేని ఒక ఉద్యోగ అర్హత పరీక్షలో సైతం అందరూ జాబ్స్ సాధించలేరు. వీరిలో అనేక మంది ఒకే విధమైన బుక్స్ చదివినప్పటికీ ఒకే రకమైన మార్కులు సాధించబోరు. దీనికి ప్రధాన కారణం వారు రూపొందించుకున్న ప్లాన్, ఆ ప్లాన్ ను అమలు చేసే తీరు. టైం మేనేజ్ మెట్. ఏ రంగంలో విజయం సాధించాలన్నా, కష్టపడడం ఒక్కటే కాకుండా, విజయానికి కావాల్సిన అన్ని రకాల వనరులను సక్రమంగా సమకూర్చుకోవాలి. వీటిలో ప్రధానమైన వనరు టైం. అనేక మంది తమకు టైం లేదు అనే మాటను తరచూ చెప్తూఉంటారు.
ప్రస్తుతం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించిన వ్యక్తులకు వరుసగా అపజయాలు చవిచూస్తున్న వారికి ఒక రోజుకు24 గంటలే ఉంటాయి. ఆ టైంని ఉపయోగించుకునే తీరు ఏ పనికి ఎంత టైం కేటాయించాలనే ప్రణాళిక ఉంటే విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు.
త్వరలో ఎగ్జామ్స్, ఉద్యోగ నోటిఫికేషన్లు : తెలంగాణలో వచ్చే నెల 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. వీటితో పాటు వివిధ శాఖల్లో గవర్నమెంట్ జాబ్ నియామకాల కోసం 2,3 నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీటిలో ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టులు ఉండనున్నాయి. రాష్ట్రంలో లక్షల మందికి పైగా వివిధ పరీక్షలకు సన్నద్ధం అవుతుండగా, వేల మందికి పైగా వివిధ గవర్నమెంట్ జాబ్ కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
సోషల్ మీడియాను వీడాలి : ప్రస్తుత సమాజంలో రాజ్యమేలుతున్న సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత టైం మిగులుతుంది. ఎగ్జామ్స్, చదువుకు ఉపయోగపడే టెలిగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలను రోజులో కొంత టైం కేటాయిస్తూ, ఆ టైంని కచ్చితంగా అమలు చేయాలి. మిగిలిన అన్ని మాధ్యమాలకు కనీసం పరీక్షలు పూర్తి అయ్యే వరకైనా దూరంగా ఉండాలి. కాలక్షేప పనులు, అనవసర ఫోన్ కాల్స్ విడిచిపెట్టాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండే తమ లక్ష్యాల సాధనలో అద్భుత విజయాలు సాధించవచ్చు.
సమయాన్ని సద్వినియోగం చేసుకువాలి : -
- ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి.
- మీ పనులకు ఆటంకం కలిగించే వాటిని దూరం ఉంచాలి.
- ఆరోగ్యానికి కొంత టైం కేటాయించాలి.
- ఒకేసారి ఎక్కువ పనులు చేయకూడదు.
- ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.
- మీ లక్ష్యాలను దెబ్బతీసే వాటికి దూరంగా ఉండాలి.
పిల్లలకు పరీక్షల్లో మస్తు మార్కులు రావాలంటే, ప్రిపరేషన్ మస్తుండాలె - ఈ మెటీరియల్స్ కొనివ్వండి!
పిల్లల పరీక్షల వేళ మారాల్సింది తల్లిదండ్రులే!
పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలా? - ఈ టిప్స్ ఫాలో అయితే ఇట్టే వచ్చేస్తాయి!