ETV Bharat / state

కుమారుడి మెడికల్ సీటు కోసం రూ.30లక్షలు సిద్ధం చేసిన తండ్రి - చోరీ చేసిన దొంగల ముఠా - SECUNDERABAD THEFT CASE

సికింద్రాబాద్ ఓల్డ్ బోయగూడలో షాప్​లో రూ.30.20 లక్షలు చోరీ - కుమారుడి ఎంబీబీఎస్ సీటుకోసం లాకర్​లో ఉంచిన నగదు మాయం - కేసును 24 గంటల్లోనే చేధించిన పోలీసులు, ముగ్గురు నిందితుల అరెస్టు

police Arrested 3 members In Theft case
police Arrested 3 members In Theft case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 10:25 PM IST

police Arrested 3 members In Theft case : తన కుమారుడి ఎంబీబీఎస్ సీటు కోసం తండ్రి లాకర్​లో దాచుకున్న రూ.30.20లక్షల సొమ్మును అంతర్రాష్ట్ర దొంగల ముఠా అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి ఓల్డ్ బోయగూడలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల వ్యవధిలో కేసును చేధించి నిందితుల నుంచి రూ.28లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

మహంకాళి డివిజన్ ఏసీపీ సర్దార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం : ఓల్డ్ బోయగూడలోని దీప్ ఇంజినీరింగ్ అనే షాప్​ను ఓ వ్యక్తి నిర్వహిస్తున్నారు. తన కుమారుడి వైద్య విద్య కోసమని షాప్​లోని లాకర్​లో రూ.30లక్షల 20వేల రూపాయలను భద్రపరుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు రాత్రివేళ షాప్ షెట్టర్ తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లాకర్​లో ఉన్నటువంటి రూ.30.20 లక్షల సొమ్మును అపహరించుకుని పారిపోయారు.

తన షాప్​ లాకర్లో ఉంచుకున్న నగదు మాయమైనట్లు గుర్తించిన యజమాని దీనిపై మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. బిహార్​కు చెందిన ప్రధాన నిందితుడు మురళీధర్ మోహన్ లాల్, ఉత్తరప్రదేశ్​కు చెందిన చంద్ర భాన్ పటేల్, ఉదయ్ రాజ్ సింగ్ లు గత ఐదేళ్లుగా మహారాష్ట్ర నుంచి వస్త్రాలను తీసుకువచ్చి జనరల్ బజార్​లో విక్రయించేవారని పోలీసులు తెలిపారు.

కుమారుడి మెడికల్ సీటు కోసం రూ.30లక్షలు సిద్ధం చేసిన తండ్రి - చోరీ చేసిన దొంగల ముఠా (ETV Bharat)

"దీపా ఇంజినీరింగ్ షాప్​లో జనవరి 31 అర్ధరాత్రి 30.20లక్షల చోరీ జరిగిందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. ముగ్గురు నిందితులను పట్టుకోవడం జరిగింది. నిందితుల గురించి ఆరా తీస్తే గత 5 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. నిందితుల నుంచి రూ.28లక్షల 62వేల నగదు రికవరీ చేయడం జరిగింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం"- సర్దార్ సింగ్, మహంకాళి డివిజన్ ఏసీపీ

ఈనెల 1వ తేదీ రాత్రి సమయంలో దీప్ ఇంజనీరింగ్ కంపెనీలో చోరీ చేసేందుకు నిందితులు ఓ లాడ్జిలో ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురళీధర్ మోహన్ లాల్ కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ చంద్ర భాన్ పటేల్, ఉదయ్ రాజ్ సింగ్​లతో దొంగతనం చేయించినట్లు విచారణలో వెళ్లడైందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు వారి నుంచి రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు.

Secunderabad Theft Case : వ్యాపారి ఇంట్లో చోరీ కేసు.. నేపాల్​ గ్యాంగ్​ నుంచి రూ.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం

13 గుళ్లలో చోరీలు రూ.70 లక్షల సొత్తు చోరీ - 400 సీసీటీవీ ఫుటేజీలతో కేసు ఛేదించిన పోలీసులు - Ratnalayam Temple Robbery case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.