Docter Nangi Bhumika Case : రోడ్డు ప్రమాదంలో తాను మరణించినా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఓ యువ డాక్టర్. కన్న కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఖఃలో ఉండి కూడా అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చి ఆమె కుటుంబ సభ్యులు ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ నంగి భూమిక పనిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే హస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది.
ఐదుగురు వేరువేరు వ్యక్తులకు : జీవన్‌దాన్ ట్రస్ట్ చొరవతో డాక్టర్ నంగి భూమిక అవయవాలు దానం చేసేందుకు బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆమె లివర్, గుండె, లంగ్స్, కిడ్నీలను ఐదుగురికి అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. పుట్టెడు దుఖఃలోనూ ఔదార్యం చూపిస్తూ అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టరమ్మ కుటుంబ సభ్యులకు సెల్యూట్ అంటూ తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
రెండేళ్ల బాలిక బ్రెయిన్ డెడ్- అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
Family Donated Brain Dead Daughter Organs : ఆ బాలిక చనిపోతూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది