4 Days Work Shop On Tuberculosis : టీబీ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల కణాలకు మాత్రమే కాకుండా కాలేయం, ఇతర కణాల్లో కూడా ఆశ్రయం పొందుతుందని కేంద్ర బయో టెక్నాలజీ (జీవ-సాంకేతిక) విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే తెలిపారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో ఆదివారం క్షయవ్యాధిపై నాలుగు రోజుల వర్క్‌షాప్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
టీబీ వ్యాధి నిర్ధారణ, టీకాల అభివృద్ధిపై : టీబీకి కారణమయ్యే మైకోబ్యాక్టీరియం ఇన్‌ఫెక్షన్లను అర్థం చేసుకోవడంలో, పరిష్కరించడంలో ఉన్న సంక్లిష్టత ఇతివృత్తంగా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. టీబీ వ్యాధి నిర్ధారణ, టీకాల అభివృద్ధిలో ప్రస్తుత పరిణామాలను ఈ వేదికపై చర్చించనున్నారు. మైకోబాక్టీరియం ట్యూబర్క్యూలోసిస్కు సంబంధించి తెలియని అనేక విషయాలను, వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు జీవ శాస్త్రవేత్తలకు ఈ కార్యశాల ఉపయోగపడనుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి తెలిపారు.
యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్(ఈఎంబీవో) ఈ వర్క్‌షాప్‌నకు తోడ్పాటు అందిస్తోంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు క్షయవ్యాధికి సంబంధించిన తమ పరిశోధనల వివరాలను పంచుకోనున్నారు.
సీసీఎంబీ 'ఓపెన్ డే' - పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన - CCMB HYD Open Day Programme
భారత్ నుంచి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సాంకేతికత .. అభివృద్ధి చేసిన సీసీఎంబీ