Snapdragon 6 Gen 4 Launch: క్వాల్కామ్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 అనే కొత్త చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ఇది ఈ దీని ప్రీవియస్ వెర్షన్ మాదిరిగానే TSMC 4nm ప్రాసెస్ బేస్డ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్. అయితే దీని CPU స్ట్రక్చర్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీనికి ఒకే మెయిన్ కోర్ ఉంటుంది. ఇది 2.3 GHz క్లాక్ స్పీడ్‌తో వస్తుంది. ఇది Gen AI (జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ ఫీచర్‌పై మరిన్ని వివరాలు మీకోసం.
ఈ చిప్‌సెట్ 11% వేగవంతమైన CPU, 29% ఫాస్టెర్ GPU, 12% బెటర్ పవర్ ఎఫిషియన్సీని అందిస్తుందని క్వాల్కామ్ చెబుతోంది. ఈ కొత్త స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌సెట్‌లో కొన్ని కొత్త మార్పులు, అప్డేట్స్ ఉన్నాయి. కంపెనీ 6-సిరీస్‌లో మొదటిసారిగా Gen AI సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ గేమ్ సూపర్ రిజల్యూషన్‌ను తీసుకొచ్చింది.
ఈ కొత్త చిప్‌సెట్ స్పీడ్ ఎంతంటే?: స్నాప్‌డ్రాగన్ తీసుకొచ్చిన ఈ 6 Gen 4 చిప్‌సెట్ CPU టాప్ స్పీడ్ 2.3GHz. ఇది స్నాప్‌డ్రాన్ 6 Gen 3 చిప్‌సెట్ గరిష్ఠ వేగం కంటే కొంచెం ఎక్కువ. దీనితో పాటు ఈ కొత్త చిప్‌సెట్ CPU స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే ఈ రెండింటి మధ్య ఉన్న అతిపెద్ద తేడా.
ఇక కొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌లో 1+3+4 కోర్లు ఉండగా, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 లో 4+4 కోర్లు ఉంటాయి. క్లియర్‌గా చెప్పాలంటే పాత వెర్షన్ ప్రాసెసర్‌లో టాప్ క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ కొత్త ప్రాసెసర్ మెరుగైన స్ట్రక్చర్ కారణంగా ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ ఎఫీషియన్సీని అందిస్తుంది.
CPU అండ్ GPU: ఈ చిప్‌సెట్‌లో ఒక ప్రైమ్ కోర్, మూడు పెర్ఫార్మెన్స్ కోర్లు, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. అవన్నీ వరుసగా 2.3GHz, 2.2GHz, 1.8GHz క్లాక్ వేగంతో నడుస్తాయి. ఇవి క్రియో అనే ARM CPU కోర్లు. ఈ స్పెసిఫికేషన్ల గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఒక్కొక్క టాస్క్ కోసం ఈ చిప్‌సెట్‌లో ఒక్కో కోర్ పనిచేస్తుంది. కొన్ని స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్‌లతో ఈ చిప్‌సెట్ గ్రాఫిక్స్ కోసం అడ్రినో GPUని ఉపయోగిస్తుంది. ఇది మెరుగైన డైనమిక్ రేంజ్ కోసం అడ్రినో HDR, బెటర్ ఫ్రేమ్ రేట్స్ కోసం అడ్రినో ఫ్రేమ్ మోషన్ ఇంజిన్ అండ్ స్నాప్‌డ్రాగన్ గేమ్ సూపర్ రిజల్యూషన్ 4K అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
AI ఫీచర్స్ అండ్ కనెక్టివిటీ: ఇది AI ఫీచర్ల కోసం హెక్సాగాన్ NPU (న్యూరల్ ప్రాసెసింగ్ ఇంజిన్)ని కలిగి ఉంది. ఇది Int4 ప్రెసిషన్ (ఖచ్చితత్వం)తో వస్తుంది. దీని సహాయంతో వినియోగదారులు తమ కాలిక్యులేషన్స్ (లెక్కలు) చాలా స్మార్ట్ అండ్ స్పీడ్‌గా చేయొచ్చు. ఇక ఈ చిప్‌సెట్ Wi-Fi 6E, LE ఆడియోతో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, నావిగేషన్ కోసం L1+L2+L5 లొకేషన్ కనెక్టివిటీ ఫీచర్, 5G సపోర్ట్‌తో వస్తుంది.
మరికొన్ని ప్రత్యేక ఫీచర్లు: పైన పేర్కొన్న వాటితో పాటు ఈ చిప్‌సెట్ ఛార్జింగ్ కోసం క్విక్ ఛార్జ్ 4+, డిస్ప్లే కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌తో HDR10+ అండ్ FHD+ సపోర్ట్, ఫోటోల కోసం 200MP సింగిల్-షాట్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఇది Geekbench అండ్ AnTuTu వంటి బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లలో ఎంత స్కోర్ చేస్తుందో, ఈ చిప్సెట్తో మార్కెట్లో ఏ స్మార్ట్ఫోన్లు లాంఛ్ అవుతాయో చూడాలి.
హాయ్ బేబీ అంటున్నారా?- ఆ పిలుపు ముంచే వలపు- హనీ ట్రాప్‌లో చిక్కారో ఇక అంతే!
ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైన ప్యాక్స్ ట్రై చేయండి!