Apple TV App Is Available For Android Users : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన యాపిల్ టీవీ సేవలను విస్తృతం చేసింది. యాపిల్ ఒరిజినల్ సిరీస్‌లను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఫోల్డబుల్ మొబైల్స్‌లోనూ యాపిల్ టీవీ యాప్‌లోని కంటెంట్ వీక్షించే సదుపాయం కల్పించింది. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ యాపిల్ టీవీ అందుబాటులోకి వచ్చిందని టెక్ దిగ్గజం తెలిపింది. గూగుల్ ప్లే అకౌంట్ ద్వారా యాపిల్ టీవీ+, ఎంఎల్ఎస్ సీజన్ పాస్‌లను వినియోగించుకోవచ్చని వివరించింది. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, సేవలను పొందవచ్చిని యాపిల్ పేర్కొంది. అయితే ఈ యాప్ అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సపోర్ట్ చేయదని తెలిపింది. ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో నడుస్తున్న అండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే ఈ యాప్ సపోర్ట్ చేస్తుందని యాపిల్ స్పష్టం చేసింది.
ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో : ఏడు రోజుల ఉచిత ట్రయల్‌తో యాపిల్ టీవీ+ సదుపాయం కల్పిస్తోంది. ఐక్లౌడ్ ఖాతా ఉన్న వినియోగదారులు ఆండ్రాయిడ్ డివైజుల్లో తమ ఐక్లౌడ్ ఐడీని ఉపయోగించి లాగిన్ అవ్వొచ్చు. వాచ్‌లిస్ట్, కంటిన్యూ వాచింగ్ లాంటి ఫీచర్లు యాపిల్ టీవీ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వైఫై లేదా మొబైల్ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆఫ్‌లైన్ కంటెంట్ వీక్షించేందుకు డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది.
చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్- సిరి, అలెక్సాకు పోటీగా రంగంలోకి 'Tasks'!