Inspection By Food Safety Officer : సికింద్రాబాద్ బేగంపేట్‌లోని అన్నానగర్‌లో పలు చికెన్ సెంటర్లపై ఆహారభద్రత, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకుల ఏకంగా 600 కిలోల కుళ్లిన చికెన్‌ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్లి పాడైపోయిన స్థితిలో ఉన్న చికెన్‌ను విక్రయించి లాభాలు సంపాదిస్తున్నారని వెల్లడించారు.
తక్కువ ధరలకే మద్యం షాపులకు సరఫరా : ఎస్ఎస్ఎస్, రవి చికెన్ దుకాణాలలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంచిన కోళ్ల మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఆహారభద్రత, టాస్క్‌ఫోర్స్ అధికారులు పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కుళ్లిన చికెన్ విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
డ్రైనేజ్ పక్కనే కిచెన్, ఫ్రిజ్‌లో కుళ్లిన మటన్ - తనిఖీ చేస్తూ షాకైన మేయర్