Mammootty Bramayugam Movie : మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి లీడ్ రోల్లో రూపొందిన 'భ్రమయుగం' సినిమాకు తాజాగా యూకేలో ఓ అరుదైన ఘనత దక్కింది. అక్కడి ఓ ఫిల్మ్ స్కూల్ సిలబస్‌లో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఆ చిత్రంపై ఓ కేస్ స్టడీ చేస్తున్నారు. సౌండ్ డిజైన్ కేటగిరిలో హాలీవుడ్ ప్రముఖ 'హారీ పోటర్' సిరీస్‌లతో పాటు ఈ మలయాళ సినిమాని పోలుస్తూ పాఠాలు చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన విజువల్స్‌ను ఓ స్టూడెంట్ సోషల్ మీడియాలో పంచుకోగా, ఇప్పుడు అది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో తెరకెక్కిన పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. సుమారు రూ.27 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.85 కోట్లకుపైగా వసూళ్లును సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.
#Bramayugam is now part of the curriculum at a prestigious London film school, at least for the time being.
— Friday Matinee (@VRFridayMatinee) February 13, 2025
It has traveled beyond countries, reaching across continents.pic.twitter.com/iSsXEHtrlu
స్టోరీ ఏంటంటే?
అది 17వ శతాబ్దం మలబార్ తీరం. జానపద గాయకుడు దేవన్ (అర్జున్ అశోకన్) ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడుతుంటాడు. ఓసారి ఆ రాజు నుంచి తప్పించుకొన్న దేవన్, తన మిత్రుడితో కలిసి ఇంటి దగ్గరున్న తన తల్లిని కలుసుకునేందుకు అటవీ మార్గంలో బయలుదేరుతాడు. అయితే ఆ దట్టమైన అడవిలో తను తప్పిపోతాడు. సరిగ్గా అదే సమయంలో తన మిత్రుడ్ని యక్షి (అమల్డా లిజ్) తినేస్తుంది. ఒంటరివాడైన దేవన్ ఆహారం వెతుక్కుంటూ అటు ఇటు తిరిగి ఓ పెద్ద పాడుబడ్డ ఇంటికి చేరుకుంటాడు.
అక్కడ యజమాని కొడుమన్ పొట్టి (మమ్ముట్టి), వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడంటూ దేవన్‌ను కొడుమన్ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్లాక దేవన్‌కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొద్దిరోజుల్లోనే తను ఆ ఇంట్లో బందీ అయినట్లుగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నాలను చేస్తాడు. మరి దేవన్ తప్పించుకున్నాడా? అసలు ఆ వంటవాడు ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? అన్నది తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీ లివ్' లో ఈ మూవీ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది.
తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా!
మలయాళ మెగాస్టార్ కొత్త ఎక్స్పరిమెంట్ - ఆ సినిమాను అలా చూపిస్తారట!