ETV Bharat / state

హెవీ వెహికల్ డ్రైవింగ్​ నేర్చుకోవాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ - RTC HEAVY VEHICLE DRIVING TRAINING

ఆర్టీసీ ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవింగ్​ శిక్షణ - నెల రోజుల ట్రైనింగ్​లో పలు అంశాలపై తర్ఫీదు - శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న నిర్మల్​ డీఎం

RTC Heavy Vehicle Driving Training
RTC Heavy Vehicle Driving Training (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 5:34 PM IST

RTC Heavy Vehicle Driving Training : చాలా మందికి డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఆసక్తి ఉంటుంది. కారు డ్రైవింగ్​లో శిక్షణ ఇచ్చేందుకు పలు డ్రైవింగ్ స్కూల్​లు ఉన్నాయి. కానీ హెవీ వెహికల్​(భారీ వాహనాలు) నేర్చుకోవాలంటే చాలా తక్కువ సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. పైగా కాస్త అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో చాలామంది వాహనాలపై పనిచేస్తూనో, తెలిసిన వాహన చోదకుల సాయంతోనే డ్రైవింగ్‌లో మెలకువలు నేర్చుకుంటుంటారు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు నిర్మల్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ తర్ఫీదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

నెలరోజుల పాటు భారీ వాహనాల డ్రైవింగ్​లో శిక్షణ : భారీ వాహనాలపై(హెవీ వెహికల్​) తర్ఫీదును ఆర్టీసీ సంస్థ వారు నెల రోజుల పాటు ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు ప్రత్యక్ష బోధన ఉంటుంది. శిక్షణలో భాగంగా ట్రాఫిక్‌ రూల్స్, బస్సు పనిచేసే విధానం ఇతరత్రా మెలకువలు, మెరుగైన డ్రైవింగ్​కు అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తారు. దీనికోసం బస్‌డిపో ఆవరణలోని భవనంలో ఓ గదిని, ప్రొజెక్టర్‌ను, నిబంధనల గురించి తెలిపే బొమ్మల ఛార్టు సిద్ధం చేశారు.

మిగతా 20 రోజులు రోజుకు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్‌ చేయించనున్నారు. ఇందు కోసం రెండు స్టీరింగులు ఉన్నటువంటి బస్సును ఉపయోగిస్తారు. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఫిట్‌నెస్‌ కోసం చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటివి చేయిస్తారు. శిక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ సిస్టం, యాంటీ బ్రేక్‌ సిస్టం, చిన్న చిన్న మరమ్మతులపైనా అవగాహన కల్పించనున్నారు. ఒక్కో బృందంలో 15 మందికి ట్రైనింగ్​ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

RTC Heavy Vehicle Driving Training
బస్సు పనితీరుపై అవగాహన కల్పించేలా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ (ETV Bharat)

ఎవరు ఈ శిక్షణకు అర్హులంటే? : నెల రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు రూ.15,600 చెల్లించాల్సి ఉంటుంది. లైట్‌ మోటారు వెహికిల్‌ (ఎల్‌ఎంవీ), ట్రాన్స్‌పోర్టు లైసెన్స్‌ కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీని సాయంతో ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్సు పొందడం మరింత సులభమవుతుంది.

ప్రయోజనం కల్గించేలా : పెద్దగా చదువుకోనివారు, నిరక్షరాస్యుల్లో చాలామంది ఆటోలు, జీపులు, కార్లను నడుపుతూ జీవనభృతిని పొందుతున్నారు. వీరిలో చాలామందికి భారీ వాహనాలు(హెవీ వెహికల్స్​) నడపాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ అవకాశం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెవీ లైసెన్స్‌ ఉంటే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవడంతో పాటు వేతనం కూడా ఎక్కువ లభిస్తుందన్న ఆశతో కొంతమంది క్లీనర్లుగా చేరి శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భారీ వాహనాలను నడపడంలో తర్ఫీదును ఇవ్వడానికి కేంద్రం ఏర్పాటు చేస్తుండటం వల్ల ఔత్సాహికుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.

"శిక్షణను ఆసక్తిగల వారు సద్వినియోగం చేసుకోవాలి. డిపో ఆవరణలో కేంద్రం నిర్వహణకు అన్ని ఏర్పాట్లున్నాయి. శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువపత్రం జారీ చేస్తాం. ఆసక్తి ఉన్నవారు రూ.15,600 చెల్లించాలి. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలైతే రూ.10 వేలు కడితే సరిపోతుంది. అదనపు సమాచారం, సందేహాల నివృత్తికి డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజన్నను సెల్​ఫోన్​ నెంబర్ 73828 42443లో సంప్రదించాలి" - ప్రతిమారెడ్డి, డీఎం, నిర్మల్‌

మీరు టెన్త్ చదివారా? - మీ కాళ్లపై మీరు నిలబడాలనుకుంటున్నారా? - వీళ్లు నిలబెడతారు!

ఎస్బీఐ నుంచి గోల్డెన్ ఆఫర్ - షీ క్యాబ్‌ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.