ETV Bharat / state

మళ్లీ విరుచుకుపడ్డ హైడ్రా, ప్రకృతి రిసార్ట్స్​, కన్వెన్షన్​ నేలమట్టం - హోర్డింగ్స్​పై నజర్ - HYDRA DEMOLISHED PRAKRUTHI RESORTS

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు - ప్రకృతి రిసార్ట్స్​, కన్వెన్షన్​ నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు - స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా - అనుమతి లేని హోర్డింగ్స్​పై నజర్

Hydra Demolished Prakruthi Resorts and Convention
Hydra Demolished Prakruthi Resorts and Convention (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 7:42 PM IST

Hydra Demolished Prakruthi Resorts and Convention : ఇన్ని రోజులు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా ఇక నుంచి అనుమతులు లేకుండా ఉన్న హోర్డింగ్స్​పై కూడా దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్​ను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హోర్డింగ్స్ తొలగించాలని సూచించినా వినిపించుకోని ఏజెన్సీలపై మండిపడ్డారు.

వాటిని తొలగించాలని ఆదేశం : ఇప్పటికే ఇలా అనుమతులు లేకుండా శంషాబాద్, కొత్వాల్ గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఉన్న 53 భారీ హోర్డింగ్స్​ను హైడ్రా తొలగించింది. 35 యూనిపోర్స్, 4 యూనిస్ట్రక్షర్స్, ఇళ్లపై ఏర్పాటు చేసిన 14 హోర్డింగ్స్​ను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అనుమతులు ఉన్న హోర్డింగ్స్​ను తొలగించమని స్పష్టం చేసిన రంగనాథ్, అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రకృతి రిసార్ట్స్​, కన్వెన్షన్​ నేలమట్టం : మరోవైపు చెరువుల ఎఫ్​టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణలపై హైడ్రా బుల్డోజర్లు వేగం పెంచాయి. నిన్నటి వరకు చిన్న చిన్న రేకుల షెడ్లను కూల్చివేసిన హైడ్రా, తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయంజాల్ గ్రామంలోని కోమటికుంట చెరువు ఎఫ్​టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్​ను నేలమట్టం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని దేవరయంజాల్ గ్రామస్థులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రకృతి రిసార్ట్స్ యజమానులు నోటీసులు ఇచ్చింది.

సమయం గడిచినా తొలగించకపోవడంతో : హైడ్రా నోటీసులను సవాల్ చేస్తూ ప్రకృతి రిసార్ట్స్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేష‌న్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదిక‌లను పరిశీలించిన కోర్టుకోమటికుంట ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రాను ఆదేశించింది. 30 రోజుల సమయం కావాలని, తామే తొలగించుకుంటామని ప్రకృతి రిసార్ట్స్ ప్రతినిధులు హైకోర్టుకు తెలిపారు. 30 రోజులు గడిచినా అక్రమ నిర్మాణాలు తొలగించకపోవడంతో రంగంలోకి దిగిన హైడ్రా ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్​ను కూల్చివేసింది.

ఇల్లు కొనేవారికి గుడ్​న్యూస్​ - హైడ్రా గొడవ లేకుండా కొత్త యాప్​ - ఈజీగా బఫర్​ జోన్లను తెలుసుకోవచ్చు

చెరువుల పరిరక్షణకు హైడ్రా పిలుపు - ఈ నంబర్​కు ఫోన్​, వాట్సప్​ చేస్తే చాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.