ETV Bharat / entertainment

'రానా నాయుడు 2' స్పెషల్ అప్​డేట్​ - త్వరలోనే ఆ రెండూ తెలుస్తాయట! - RANA NAIDU 2

'రానా నాయుడు 2' స్పెషల్ అప్​డేట్​ - త్వరలోనే ఆ రెండింటి గురించి తెలుస్తుందట!

Rana Naidu 2
Rana Naidu 2 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2025, 3:42 PM IST

Updated : Feb 13, 2025, 3:50 PM IST

Actor Rana About Rana Naidu 2 : టాలీవుడ్ స్టార్ హీరో రానా, విక్టరీ వెంకటేశ్​ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ 'రానా నాయుడు'. 2024లో వచ్చిన ఈ సిరీస్​కు సీక్వెల్​గా ఇప్పుడు 'రానా నాయుడు 2' రానుంది. అయితే గతంలోనే ఈ ప్రాజెక్ట్​ గురించి అనౌన్స్ చేసినప్పటికీ, దాని గురించి మరిన్ని అప్​డేట్స్ రాలేదు.

ఆ రెండూ రెడీ
ఈ నేపథ్యంలో తాజాగా హీరో రానా ఈ వెబ్​ సిరీస్​ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఆయన నిర్మాణంలో వస్తోన్న ఇట్స్​ కాంప్లికేటడ్​ చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్​లో రానా మాట్లాడారు. రానా సంబంధించిన ట్రైలర్‌ సిద్ధంగా ఉందని, రిలీజ్ డేట్​ కుడా ఖరారైనట్లు ఆయన తెలిపారు. త్వరలోనే స్ట్రీమింగ్‌కు వస్తుందని అన్నారు.

Rana Naidu Season 1 : హాలీవుడ్ వెబ్​సరీస్​ 'రే డొనోవన్' ఆధారంగా ఇండియన్ నేటివిటికి తగ్గట్లుగా రూపొందింది 'రానా నాయుడు'. సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్ డైరెక్ట్​ర్లుగా వ్యవహించారు. పలు ఎపిసోడ్​లుగా రూపొందిన ఈ ​సిరీస్​లో బోల్డ్​ కంటెంట్ కాస్త ఎక్కువైందని పబ్లిక్ టాక్. అయితే దీనికి తెలుగులో కంటే హిందీ, ఇతర భాషల్లో ఎక్కువ స్పందన వచ్చింది.

మరోవైపు సినిమాలకే పరిమితమైన విక్టరీ వెంకటేశ్​ తొలిసారి వెబ్​ సిరీస్​లో నటించారు. రానా తన నటనతో అభిమానుల అంచనాలు అందుకున్నారు. అంతేకాకుండా భారత్​లో ఎక్కువ వ్యూస్ పొందిన సిరీస్​గా రికార్డుకెక్కింది. మూడు వారాల పాటు మోస్ట్​ వ్యూస్​ ఆఫ్​ ది సిరీస్‌గా దేశంలోనే నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది కూడా. ఇక విడుదల తర్వాత రెండు వారాల పాటు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో నాన్-ఇంగ్లీష్ టీవీ షోల కేటగిరిలో 'రానా నాయుడు' ట్రెండ్ అయ్యింది.

Last Updated : Feb 13, 2025, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.