ETV Bharat / technology

హాయ్ బేబీ అంటున్నారా?- ఆ పిలుపు ముంచే వలపు- హనీ ట్రాప్​లో చిక్కారో ఇక అంతే! - VALENTINE DAY 2025 ROMANCE SCAMS

వాలెంటైన్స్​ డే వేళ రొమాన్స్ స్కామ్స్- మెటా ఇచ్చిన టిప్స్​తో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టండిలా​!

Romance Scams on Valentine's Day
Romance Scams on Valentine's Day (Photo Credit- ETV BHARAT VIA COPILOT DESIGNER)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 13, 2025, 8:47 PM IST

Valentine Day 2025 Romance Scams: ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక మూల ఆన్​లైన్​ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుని కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. అలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో డేటింగ్ అండ్ రొమాన్స్ స్కామ్స్ ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

దీని గురించి తెలియనివారు ఇప్పుడు ఈ పేరు విని నవ్వుకోవచ్చు. కానీ ఇదొక రకమైన హనీ ట్రాప్. సైబర్ మోసగాళ్లు ఆన్​లైన్​లో వలపు వల విసిరి అమాయకులను ట్రాప్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ వాలెంటెన్స్​ వీక్​లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉంది.

ఎందుకంటే ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు భారత్​తో సహా ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్ వీక్ జరుపుకొంటారు. ఈ వారంలో ఆఖరి రోజున అంటే ఫిబ్రవరి 14న వాలెంటెన్స్ డే నిర్వహిస్తారు. దీంతో ప్రేమ పేరుతో ఈ సమయంలో రొమాన్స్ స్కామ్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ మాతృసంస్థ అయిన మెటా ఈసారి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రొమాన్స్ స్కామ్​ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సేఫ్టీ టిప్స్​ అందించింది.

రొమాన్స్ స్కామ్‌లు అంటే ఏంటి?: ఈ తరహా మోసాల్లో సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్​ క్రియేట్ చేసి మెసెజెస్ పంపించి నెమ్మదిగా మిమ్మల్ని ట్రాప్​లోకి దించుతారు. ఆ తర్వాత మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నట్లు నటించి ఏదో ఒక సాకుతో డబ్బులు అడగడం మొదలుపెడతారు. కొంతమంది అయితే వారి ఫేక్ బిజినెస్ లేదా షేర్స్​లో పెట్టుబడులు పెట్టమని చెబుతుంటారు. దీని ద్వారా తమ డబ్బు రెండింతలు, మూడింతలు లేదా అనేక రెట్లు లాభాలు వస్తాయని నమ్మిస్తుంటారు.

ఇదికాకుండా ఇంకొంతమంది ప్రేమిస్తున్నట్లు నటించి ఎలాగోలా సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్​ల ద్వారా అసభ్యకరమైన ఫొటోస్ లేదా వీడియోలను రికార్డ్ చేసుకుంటారు. ఆపై బ్లాక్ మెయిల్​కి పాల్పడి డబ్బులు ఇవ్వమని మిమ్మల్ని డిమాండ్ చేస్తుంటారు. ఈ రకమైన మోసాలనే రొమాన్స్​ స్కామ్స్ అంటారు. ఇందులో సైబర్ మోసగాళ్లు అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుని వలపు వలవేసి దోపిడీలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి స్కామ్స్​ను ఎలా గుర్తించాలి?:

మిలిటరీ వేషధారణ: ఇలాంటి మోసాలకు తెగబడేవారు సైన్యంలో పనిచేస్తున్నట్లు నటించి మీతో పరిచయం పెంచుకుంటారు. క్రమంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. దీంతో అది నిజమేనని నమ్మి మీరు వారి వలలో చిక్కుకున్నాక అసలు కథ మొదలు పెడతారు. ఏదో ఒక సాకుతో డబ్బులు అడగటం మొదలుపెట్టి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. ఈ తరహా స్కామ్​లు ఎక్కువగా వాట్సాప్​, టెలిగ్రామ్ లేదా మెసెంజర్ ద్వారా జరుగుతుంటాయి.

సెలబ్రిటీ వేషధారణ: కొంతమంది స్కామర్లు సెలబ్రిటీల ముసుగులో మోసాలకు తెగబడుతుంటారు. వారిని వారు చాలా ఆకర్షణీయంగా, సంపన్నులుగా అభివర్ణించుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా మీతో ప్రేమలో పడినట్లు నటిస్తారు. మీరు కూడా అది నిజమేనని నమ్మితే ఇక అంతే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి డబ్బులు దోచుకుంటారు.

నకిలీ మ్యాచ్-మేకింగ్ ఏజెన్సీలు: వాలెంటైన్స్ డే లేదా అలాంటి ఏదైనా సందర్భాల్లో కొంతమంది ఒంటరి వ్యక్తులు తమకు తాముగా లైఫ్ పార్టనర్ కోసం వెతుకులాట మొదలు పెడతారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో సింగిల్​గా ఉన్న అబ్బాయిలు, లేదా అమ్మాయిలను కనుగొనడం చాలా ఈజీ. అయితే ఈ క్రమంలో వారు నకిలీ డేటింగ్ యాప్​ల బారిన పడి వేల నుంచి లక్షల రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటారు.

ఇలాంటి రొమాన్స్ స్కామ్స్​ నుంచి తన ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులను రక్షించుకునేందుకు మెటా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తమను తాము సైనిక సిబ్బంది లేదా వ్యాపారవేత్తలుగా చూపిస్తున్న అనేక ఫేక్ ప్రొఫైల్స్​ను మెటా తన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్ అకౌంట్స్​ను గుర్తించడం ప్రారంభించింది.

ఇందుకోసం మెటా వివిధ దేశాల లా ఎన్​ఫోర్స్​మెంట్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. తద్వారా ఈ తరహా మోసాలు చేస్తున్న స్కామర్‌లను పట్టుకోవచ్చని భావిస్తోంది. ఇది మాత్రమే కాకుండా మెటా అనేక దేశాలలో ఇలాంటి మోసాలపై ప్రజలల్లో అవగాహన పెంచేందుకు చాలా మంది పబ్లిక్ సెలబ్రిటీలు, NGOలు, సోషల్ మీడియా క్రియేటర్‌లతో కలిసి పనిచేస్తోంది.

ఈ విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి:

  • బీ అలెర్ట్: అమాయకులను తమ వలలో పడేసేందుకు సైబర్ మోసగాళ్లు ఏదో ఒక సాకులు వెతుక్కుంటారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను ఏర్పరుచుకుంటారు. కాబట్టి అంత ఈజీగా ఎవరినీ నమ్మకుండా ఉండటం మంచిది.
  • సేఫ్టీ నోటీసెస్: ఈ ఫీచర్ ఫేస్​బుక్ మెసెంజర్​లో తెలియని లేదా అనుమానాస్పద అకౌంట్​తో మీరు చాట్ చేస్తుంటే ఇది మీకు వార్నింగ్​ను పంపించి మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది.
  • వాట్సాప్​: మెటాకు చెందిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మీరు మీకు తెలియని నంబర్ల నుంచి వస్తున్న కాల్స్ లేదా మెసెజ్​లను మ్యూట్ చేయొచ్చు. తద్వారా మీరు ఇలాంటి స్కామ్స్​ బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
  • స్మార్ట్ డిటెక్షన్: మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో స్కామర్ల ప్రొఫైల్‌లను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ వంటి అనేక టెక్నికల్ చర్యలను తీసుకుంది. మీరు కూడా తెలిసినవారిలా అనిపించినా కొన్ని ప్రొఫైల్‌లను చూసి నమ్మి మోసపోకుండా జాగ్రత్త వ్యవహరించండి.

ఈ తరహా స్కామ్స్​ను ఎలా నివారించాలి?:

  • అన్నింటిలో మొదటిది అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అయినా తెలియని వ్యక్తులతో కనెక్ట్ అవ్వకుండా ఉండటం మంచిది. ప్రొఫైల్ మీకు తెలిసిన వారు లేదా సెలబ్రిటీలు మొదలైన వారిలా కనిపించినప్పటికీ అది సరైన వ్యక్తి ప్రొఫైలేనా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
  • దీంతోపాటు మీ ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల సెక్యూరిటీని పెంచుకోండి.
  • ప్రేమికుల రోజున ఎలాంటి నకిలీ డేటింగ్ యాప్‌లు లేదా లవ్ అండ్ రొమాన్స్ వంటి ఫేక్ యాక్టివిటీలలో పాల్గొని సమస్యల్లో చిక్కుకోకండి. ప్రేమ పేరుతో ఎవరైనా డబ్బులు అడుగుతుంటే చాలా అప్రమత్తంగా ఉండండి.
  • మీకు ఎవరిపైన అయినా కాస్త అనుమానంగా అనిపించినా వెంటనే వారితో అన్ని పరిచయాలను ముగించి సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది.

ఖరీదైన రీఛార్జ్​ ప్లాన్​లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైన ప్యాక్స్ ట్రై చేయండి!

అదిరే లుక్​లో టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ లాంఛ్- ధర ఎంతంటే?

మార్చి నుంచి దేశంలో వొడాఫోన్-ఐడియా 5G సర్వీసులు!- మొదట ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.