GHMC Mayor Falls Down on Footpath : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతుండగా కాలు స్లిప్ అవడంతో ఫుట్‌పాత్‌పై కింద పడిపోయారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పలు సుందరీకరణ పనుల ప్రారంభోత్సవంలో హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మేయర్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఫుట్‌పాత్ కాలు స్లిప్ అవ్వడంతోనే : ఈ క్రమంలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్ ప్లైఓవర్ కింద చేపట్టిన విద్యుద్దీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారి మేయర్ విజయలక్ష్మీ కిందపడిపోయారు. పుట్‌పాత్‌పై పేర్చిన రాళ్ల మధ్య మేయర్ కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న జీహెఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ విజయారెడ్డి మేయర్‌ను పైకి లేపారు. మేయర్ ఇంకాస్త ముందు పడిపోయి ఉంటే అక్కడ ఉన్న రాతి స్థంభానికి తగిలే ప్రమాదం ఉండేది.
ఎలాంటి గాయాలు కాలేదు : ఒక్కసారిగా అక్కడున్న భద్రతా సిబ్బంది, చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులు కంగారుపడ్డారు. పైకి లేచిన అనంతరం మేయర్ తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి తదుపరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Viral Video : కామన్ సెన్స్ ఉందా? - మహిళా కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి సీరియస్
VIRAL VIDEO : యూటర్న్ తీసుకునేటప్పుడు జాగ్రత్త - లేదంటే మీకూ ఇలాగే జరగొచ్చు!