ETV Bharat / offbeat

మీ ఇంట్లో ఈ పౌడర్ ఉంటే చాలు - నిమిషాల్లో తీరొక్క "బజ్జీలు" చేసుకోవచ్చు! - BAJJI BONDA MIX RECIPE

ఇన్​స్టంట్ "బజ్జీ బోండా పౌడర్‌" - సింపుల్​గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా!

Instant Bajji Recipe
Bajji Bonda Mix Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 1:58 PM IST

Bajji Bonda Mix Recipe in Telugu : చాలా మందికి సాయంకాలం పూట ఏదో ఒక స్నాక్ తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది అలా బయటకు వెళ్లి మిర్చి, ఆలూ, అరటికాయ బజ్జీలు, పునుగులు వంటి స్ట్రీట్ ఫుడ్స్​ని ఆస్వాదిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు బడి నుంచి రాగానే తినడానికి స్నాక్స్ అడుగుతుంటారు. అలాంటి టైమ్​లో ఈ పౌడర్​ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు నిమిషాల్లో వివిధ వెరైటీల్లో బజ్జీలను వేసి ఇవ్వొచ్చు. పైగా దీన్ని ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకున్నారంటే రెండు మూడు వారాలు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిజ్​లో ఉంచారంటే ఇంకా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు! అంతేకాదు, ఈ పౌడర్​తో​ ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీలు చాలా రుచికరంగానూ ఉంటాయి. మరి, ఈ ఇన్​స్టంట్ బజ్జీ బోండా పౌడర్‌ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - కప్పు
  • బియ్యప్పిండి - అర కప్పు
  • సోంపు పొడి - చెంచా
  • కశ్మీరీ రెడ్‌ చిల్లీ పౌడర్‌ - 2 చెంచాలు
  • డ్రై జింజర్ పౌడర్ - అర చెంచా
  • పసుపు - అర చెంచా
  • బేకింగ్ సోడా - అర చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఇంగువ - పావు చెంచా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, కశ్మీరీ రెడ్‌ చిల్లీ పౌడర్‌, ఉప్పు, సోంపు పొడి, డ్రై జింజర్ పౌడర్, పసుపు, బేకింగ్ సోడా, ఇంగువ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆ తర్వాత విస్క్​ సాయంతో ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ పౌడర్​ని తడిలేసి సీసాలో స్టోర్ చేసుకోవాలి.
  • ఇక్కడ చెప్పుకున్న కొలతల ప్రకారం ఎక్కువ మోతాదులోనూ మీరు బజ్జీ బోండా మిక్స్​ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
  • ఇక మీకు ఎప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే అప్పుడు తగినంత పరిమాణంలో ఈ పౌడర్​ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మరీ గట్టిగా, మరీ జారుగా లేకుండా పిండిని కలుపుకోవాలి.
  • అప్పుడు ఆ పిండితో మిర్చి, బంగాళదుంప, వామాకు, తమలపాకు, అరటికాయ బజ్జీలు ఇలా ఏవి కావాలనుకుంటే ఆ బజ్జీలను వేసుకొని వేడివేడిగా ఆస్వాదించవచ్చు! చాలా రుచికరంగానూ వస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ఇన్​స్టంట్ బజ్జీ బోండా పౌడర్​తో చేసే స్నాక్ రెసిపీలను ఎంతో ఇష్టంగా తింటారు.

ఇవీ చదవండి :

బరువు తగ్గాలనేవారికి సూపర్ స్నాక్ - కరకరలాడే "ఓట్స్ పకోడీ" - తింటూ తగ్గిపోండి!

అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్ "స్పైసీ ఉల్లి మిక్చర్" - ఇంట్లోనే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.