ETV Bharat / sports

చెన్నైలో దుమ్ముదులిపిన తెలుగోడు- రెండో T20లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ - IND VS ENG 2025

రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం- చెలరేగిన తిలక్ వర్మ

India vs England
India vs England (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 25, 2025, 10:34 PM IST

India vs England 2nd T20I : ఇంగ్లాండ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెన్నై వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్​లో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72* పరుగులు) అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్​స్టోన్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ హాఫ్ సెంచరీతో భారత్​ను విజయతీరాలకు చేర్చిన తిలక్ వర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 165-9 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (45 పరుగులు; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్. బ్రైడన్‌ కార్సే (31 పరుగులు; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22 పరుగులు; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4 పరుగులు), బెన్ డకెట్ (4 పరుగులు) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పెవిలియన్ చేరారు. హ్యారీ బ్రూక్ (13 పరుగులు), లివింగ్‌స్టన్ (13 పరుగులు) ఆకట్టుకోలేకపోయారు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 2, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు.

కాగా, తాజా విజయంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో టీమ్ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్​కు రాజ్​కోట్ వేదిక కానుంది.

స్కోర్లు

  • ఇంగ్లాండ్ - 165-9 (20 ఓవర్లు)
  • భారత్ - 166-8 (19.2 ఓవర్లు)

భారత్ తుది జట్టు : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లాండ్ తుది జట్టు : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.