ETV Bharat / politics

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ​ - గంటకు పైగా జరిగిన సమావేశం - CM REVANTH REDDY MEETS PM MODI

సీఎం రేవంత్​ రెడ్డి దిల్లీ పర్యటన - ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్​ భేటీ - పలువురు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం

CM Revanth Reddy Delhi Tour
CM Revanth Reddy Delhi Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 10:25 AM IST

CM Revanth Reddy Delhi Tour : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్​ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశం గంటకుపైగా జరిగింది. రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం అందించాలని ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్​లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పీఎంను ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలని, రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు ఆర్థికసాయం చేయాలని ప్రధానిని సీఎం కోరారు.

ఈ సమావేశానికి సీఎం రేవంత్​ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్​ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్​ఎల్​బీసీ ప్రమాద ఘటనను పీఎంకు సీఎం వివరించారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయాన్ని ముఖ్యమంత్రి కోరారు. విభజన చట్టంలోని పెండింగ్​ సమస్యలను ప్రధానికి సీఎం రేవంత్​ వివరించారు. ప్రధానితో భేటీ ముగియడంతో పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం రేవంత్​ రెడ్డి కలిసే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్​మెంట్​ సమాచారం రావడంతో ఆయన మంగళవారం రాత్రి దిల్లీ వెళ్లారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్​ రెడ్డి దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్​ఎల్​బీసీ ప్రమాదంపై మోదీ ఆయనతో ఫోన్​లో మాట్లాడారు. కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి సీఎం దిల్లీలోని అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.