Seating Capacity in Visakhapatnam Vande Bharat Trains Increased : విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ (20707/20708) ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌లో సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనుందని తెలిపింది. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ రైలును 2024 మార్చి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఎగ్జిక్యూటివ్ కోచ్1, ఛైర్‌కార్ కోచ్‌లు 7 ఉన్నాయి. తాజా నిర్ణయింతో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2కి, ఛైర్‌కార్ కోచ్‌లు 14కి పెరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సౌకర్యాలపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే ట్విటర్ ద్యారా తెలిపింది.
Excited to undertake the journey to #Visakhapatnam by today's Vande Bharat Express from Secunderabad.... confirmation of tickets got possible due to adding of additional coaches to the train @RailMinIndia pic.twitter.com/fxAWpUSZdb
— South Central Railway (@SCRailwayIndia) January 11, 2025
"మూడు రోజుల నుంచి విశాఖకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్ని రైళ్లు ప్రయత్నించినా దొరకలేదు. నిన్న మధ్యాహ్నం బుక్ చేశాం. కన్ఫర్మ్ కాగానే చాలా సంతోషించాం. చాలా ఆనందంగా ఉంది." - ప్రయాణికురాలు
సంక్రాంతి రద్దీకి తగ్గట్లు మారిన వందేభారత్ - విశాఖ ట్రైన్‌కు అదనపు కోచ్‌లు
గంటకు 180 కి.మీ వేగంతో వందే భారత్ స్లీపర్ రయ్ రయ్ - ఈ వైరల్ వీడియో చూశారా?