ETV Bharat / state

స్కిల్స్​ యూనివర్సిటీలో కొత్త కోర్సులు - జాయిన్ అయితే చేతిలో జాబ్ ఉన్నట్లే! - TS SKILLS UNIVERSITY NEW COURSES

యంగ్ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీ కొత్తగా మూడు కోర్సులు - శిక్షణతో పాటు ఉద్యోగం

Young India Skills University Introduced Three New Courses
Young India Skills University Introduced Three New Courses (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Young India Skills University Introduced Three New Courses : యంగ్ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీ కొత్తగా ఎండోస్కోపీ టెక్నీషియన్​, ప్రొటోటైపింగ్, మెడికల్ కోడింగ్​ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సుల్లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్​ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది.

రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది. ఫార్మా, నిర్మాణ, బ్యాంకింగ్, ఫైనాన్స్​ సర్వీసెస్​, ఈ కామర్స్​ - లాజిస్టిక్స్​, రిటైల్​, యానిమేషన్, విజువల్​ ఎఫెక్ట్​, గేమింగ్​-కామిక్స్​ తదితర కోర్సులు ఉన్నాయి. సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి, యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తాజాగా ఈ యూనివర్సిటీ కిమ్స్​, ఏఐజీ ఆసుపత్రులు, టీ-వర్క్స్​ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కోర్సులకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వైఐఎస్​యూ.ఇన్​లో చూడాలి అని అధికారులు సూచిస్తున్నారు.

'అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్​ స్కూల్స్ - ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు' - Tg Integrated Residential Schools

ఎండోస్కోపీ టెక్నీషియన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం

వ్యవధి: 6 నెలలు

అర్హత: ఇంటర్‌(బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయసు: 25 ఏళ్లలోపు

శిక్షణ: ఎండోస్కోపీ ఆపరేషన్స్‌పై క్లాస్‌ రూం, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌

ఉపాధి అవకాశాలు: ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్‌మెంట్‌

ఫీజు: రూ.10 వేలు

ప్రొటోటైపింగ్‌ స్పెషలిస్ట్‌ ప్రోగ్రాం

వ్యవధి: 2 నెలలు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: 18-25 ఏళ్లలోపు

శిక్షణ: డిజైన్‌ థింకింగ్, క్యాడ్‌/క్యామ్‌పై బెసిక్ కాన్సెప్ట్స్​, 3డీ ప్రింటింగ్, వెల్డింగ్, సీఎన్సీ మిషనింగ్, అడ్వాన్స్‌డ్‌ ర్యాపిడ్‌ ప్రొటోటైపింగ్, ప్యాకేజింగ్, ఉడ్, లేజర్‌ కటింగ్‌ తదితర అంశాలపై ట్రైనింగ్

ఉపాధి అవకాశాలు: జూనియర్‌ ప్రొటోటైపింగ్‌ టెక్నీషియన్‌గా అవకాశం

ఫీజు: రూ.3 వేలు

మెడికల్‌ కోడింగ్‌ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ ప్రోగ్రాం

వ్యవధి: 55 రోజులు (45 రోజులు- మెడికల్‌ కోడింగ్ శిక్షణ ఉంటుంది, 10 రోజులు-సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్ ఇస్తారు)

అర్హులు: బీఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణత

వయసు: 18-25 ఏళ్లలోపు

శిక్షణ: మాస్టర్‌ మెడికల్‌ టెర్మినాలజీ, కోడింగ్‌ సిస్టమ్స్‌పై శిక్షణ

ఉద్యోగ అవకాశాలు: మెడికల్‌ కోడింగ్‌ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ మెడికల్‌ కోడర్‌

ఫీజు: రూ.18 వేలు

స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ భారీ విరాళం

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.