ETV Bharat / state

అడ్మిన్లు బీ కేర్ ఫుల్, మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది - అల్లు వార్నింగ్ - ALLU ARAVIND ON THANDEL MOVIE

తండేల్ సినిమా పైరసీ చేయడంపై అల్లు అరవింద్ ఆగ్రహం - ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమా పైరసీ సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడి - 2 నెలల నుంచి సినిమా పైరసీ రాక్షసి విరుచుకుపడుతుందని వ్యాఖ్య

Allu Aravind On Thandel Movie piracy Issue
Allu Aravind On Thandel Movie piracy Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2025, 8:03 PM IST

Allu Aravind On Thandel Movie piracy Issue : అంతా తెలిసే, కావాలని చిత్రాన్ని పైరసీ చేస్తున్నారని ‘తండేల్‌’ సినిమా నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగచైతన్య కథానాయకుడిగా, సాయిపల్లవి హీరోయిన్​గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు. అంతేకాదు, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసు ప్రెస్​మీట్​లో మాట్లాడారు.

పైరసీ సెల్‌ను ఇంకా బలోపేతం చేయాలి : ఫిల్మ్ ఛాంబర్ చర్యల వల్ల కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ జరగడం లేదని, అయితే రెండు నెలల నుంచి మళ్లీ ఈ రాక్షసి విరుచుకుపడుతోందని అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గేమ్ ఛేంజర్’ను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారన్నారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించినట్లుగా వివరించారు. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

క్వాలిటీ ప్రింట్‌ ఎక్కువగా వచ్చేస్తోందని అల్లు అరవింద్ అన్నారు. వాట్సప్ గ్రూపుల్లో సంబంధిత లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేస్తున్నటు వంటి వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించామన్నారు. వారి సమాచారాన్ని సైబర్‌ క్రైమ్‌ విభాగం దృష్టికి తీసుకెళ్లామని అల్లు అరవింద్ తెలిపారు. వారందనినీ అరెస్ట్‌ చేయిస్తాం అని ఆయన తెలిపారు.

"వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు బీ కేర్ ఫుల్. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాము. ఇదొక నేరం. ఇప్పుడు సైబర్‌ విభాగం సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా సులభమే. కొంతమంది వెబ్‌సైట్లలోనూ పెడుతున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ‘తండేల్’ సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం దారుణం. మూవీ సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకంగా మారింది. పైరసీ సెల్‌ను మరింత బలోపేతం చేయాలి." - అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత

'కేబుల్ ఆపరేటర్‌లకు కూడా మా హెచ్చరిక. మా సినిమాలోని క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. తండేల్’ పైరసీ చేస్తే 9573225069 నెంబర్​కు మెసేజ్ చేయండి. సాక్ష్యాలు ఉంటే, కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం'- బన్నీవాసు, నిర్మాత

ఆఫ్రికన్‌ దేశాల్లో ఉన్న ఐపీల నుంచి మూవీ : తండేల్‌ చిత్రం’ పైరసీ కాపీ 100శాతం ఓవర్సీస్‌ నుంచే వచ్చిందని బన్నీవాసు తెలిపారు. ఇది తమిళ ప్రింట్‌ నుంచి వచ్చిందని అన్నారు. దానికి తెలుగు ఆడియో కలిపారని వివరించారు. ఆ అంశాన్ని కూడా గుర్తించామన్నారు. క్యూబ్‌లో కోడ్‌ ఉంటుందని వివరించారు. కానీ, పైరసీ కాపీలో ఆ కోడ్‌లేదన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిని గుర్తించే పనిలో ఉన్నామని బన్నీవాసు తెలిపారు. ఆఫ్రికన్‌ దేశాల్లో ఉన్న ఐపీ అడ్రస్‌ల నుంచి ప్లే చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వివరించారు. అక్కడ పెద్దగా మనకు సైబర్‌ సపోర్ట్‌ ఉండదని తెలిపారు. ఈ విషయంలో నిర్మాతలకు మన ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్‌ చేస్తోందన్నారు. పైరసీ చేసిన వాళ్లకి, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయని బన్నీ వాసు హెచ్చరించారు.

'తండేల్' తగ్గేదేలే - రెండో రోజు అక్కడ కూడా మంచి జోరుగా!

ఓవర్సీస్​లో 'తండేల్' జోరు - తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.