ETV Bharat / spiritual

ఆ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలతో నష్టం - కనకధారా స్తోత్రం పఠించడం మంచిది! - HOROSCOPE TODAY FEBRUARY 11TH 2025

2025 ఫిబ్రవరి 11వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Horoscope Today February 11th 2025
Horoscope Today February 11th 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2025, 5:01 AM IST

Horoscope Today February 11th 2025 : 2025 ఫిబ్రవరి 11వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని గ్రహాలు విశేషంగా కలిసి వస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ పని చేసిగా రెట్టింపు శుభ ఫలితాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా పట్టుదలతో అధిగమిస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే మంచిది. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తప్పవు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి కార్యసిద్ధి ఉంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధనపై దృష్టి పెడితే మంచిది. ప్రతి విషయాన్ని అనుమానించడం మంచిది కాదు. కాలాన్ని వృథా చేయకుండా కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు త్వరత్వరగా పూర్తవుతాయి. మీ మీ రంగాలలో శుభఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి సాధిస్తారు. శత్రుభయం తొలగిపోతుంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తివ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో ఆర్థికవృద్ధి సాధిస్తారు. మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని వ్యవహారాల్లో మొహమాటం వద్దు. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పైఅధికారులతో వినయంగా ఉండకపోతే ప్రమాదం. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉత్సాహం కోల్పోకండి. మనోవిచారం కలిగించే సంఘటనలు జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించండి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ఓ కీలకమైన విషయంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. సన్నిహితుల వలన మేలు జరుగుతుంది. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కోపం అదుపులో ఉంచుకోండి. ఈశ్వరుని ఆలయ సందర్శనం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వబుద్ధితో గొప్పవారవుతారు. చేపట్టిన పనుల్లో సమర్ధవంతంగా పనిచేస్తేనే విజయం సిద్ధిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కీలక విషయాల్లో ఆచి తూచి అడుగేయాలి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బద్దకంతో పనులు వాయిదా వెయ్యకండి. కీలక విషయాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేపడితే మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో స్థానచలన సూచనలున్నాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో సందర్భానుసారం ముందుకెళ్తే ప్రయోజనం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కనకధారా స్తోత్రం పఠించడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.