Honey Bees Attack In Nalgonda : నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో ఐదుగురు కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గరుకి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, తాటికల్ పంచాయతీ పరిధిలోని ఆర్లగడ్డ గూడెం గ్రామానికి చెందిన పి.ప్రభాకర్ (54) కంప చెట్లను నరికి కర్రలు విక్రయిస్తుంటాడు. సోమవారం ఐదుగురు కూలీలను వెంటతీసుకొని తాటికల్-నకిరేకల్ మధ్య ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద కంప చెట్ల కర్రలను ట్రాక్టర్లో లోడు చేస్తున్నారు.
తేనెటీగల దాడి : పక్కనే చెట్లపై వాలి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వచ్చి దాడి చేశాయి. మంటను అడ్డుపెట్టుకొని వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు. పెద్ద మొత్తంలో తేనె టీగలు రావడంతో వాటిబారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయింది. ట్రాక్టరుపై కర్రలు పెడుతున్న ప్రభాకర్‌ను, అక్కడే పని చేస్తున్న వి.రామలింగాచారి, యాదిరెడ్డి, మారయ్యలపై తేనె టీగలు దాడి చేసి గాయపరిచాయి. మరో ఇద్దరు కూలీలు పరిగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు.
పెంపుడు తేనెటీగలు - 12ఏళ్లుగా కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వ్యక్తి! ఆ ఫ్యామిలీలో ఎవరినీ కుట్టవు!
Honey Bees Attack: ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి... 19 మందికి గాయాలు