ICC Champions Trophy 2025 Prize Money : పాకిస్థాన్ వేదికగా మరికొద్ది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా టీమ్‌లు తమ తుది స్క్వాడ్‌లను ప్రకటించాయి. అయితే టీమ్‌ఇండియా ఆడే మ్యాచులు మాత్రం దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
ఇక తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని ఐసీసీ ప్రకటించింది. 2017లో చివరిసారిగా ఈ టోర్నీ జరిగినప్పటితో పోలిస్తే దాదాపు 53 శాతం పెంచారని తెలుస్తోంది. ఈ క్రమంలో సుమారు రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని అన్నీ టీమ్‌లకు పంచనుంది. అలా చివరి ప్లేస్‌లో నిలిచిన జట్టుకు కూడా రూ.1.22 కోట్ల మేర దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.29 లక్షలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్రైజ్‌మనీ ఎలా అందించనున్నారంటే :
విన్నర్ ప్రైజ్‌మనీ : రూ. 20.8 కోట్లు
రన్నరప్ ప్రైజ్‌మనీ: రూ. 10.4 కోట్లు
సెమీ ఫైనలిస్ట్స్ : రూ. 5.2 కోట్లు (ఒక్కొక్క జట్టుకు)
ఐదు, ఆరు స్థానాల టీమ్స్ : రూ.3 కోట్లు
ఏడు, ఎనిమిది స్థానాల టీమ్స్ : రూ.1.2 కోట్లు
ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్‌మనీ : రూ.29 లక్షలు
గత ట్రోఫీలో ఎవరికెంత వచ్చిందంటే ?
ఇదిలా ఉండగా, 8 ఏళ్ల క్రితం 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ ఫైనల్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. అయితే అప్పుడు ఆ జట్టుకు రూ. 14.18 కోట్లను ప్రైజ్‌మనీని ఇచ్చింది ఐసీసీ. ఇక ఆ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన టీమ్ఇండియాకు రూ.7 కోట్లు వచ్చింది. సెమీస్‌కు చేరిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌కు చెరొక టీమ్‌కు రూ.3 కోట్లు రాగా, ఐదు ఆరు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా,సౌతాఫ్రికాకు చెరో రూ.58 లక్షలు, ఆఖరి రెండు ప్లేస్‌ల్లో వచ్చిన శ్రీలంక, న్యూజిలాండ్‌కు చెరో రూ.39 లక్షలు అందాయి.
రెండు గ్రూపులుగా జట్లు
ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లను రెండు గ్రూపులు విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్- 2గా నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సెట్! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే