ETV Bharat / state

'నాకే జీవిత ఖైదు విధిస్తావా - నీ అంతు చూస్తా!' : మహిళా జడ్జిపై చెప్పుతో నిందితుడి దాడి - ATTACK ON LADY JUDGE IN COURT

కేసు విచారణ జరుగుతుండగా జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు - కోర్టు నుంచి ఖైదీని తరలిస్తుండగా ఆగ్రహంతో చుట్టుముట్టిన న్యాయవాదులు

Attack on Lady judge in Rangareddy Court
Attack on Lady judge in Rangareddy Court (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 1:54 PM IST

Attack on Lady judge in Rangareddy Court : హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు హాల్‌లో గురువారం మహిళా జడ్జిపై ఓ ఖైదీ చెప్పుతో దాడి చేశాడు. హత్య కేసు విచారణ జరుగుతుండగా చెప్పు విసిరాడు. ఈ దుశ్చర్యతో ఆగ్రహానికి గురైన న్యాయవాదులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అత్తాపూర్‌ సిఖ్‌ విలేజ్‌కు చెందిన కరణ్‌సింగ్‌ అలియాస్‌ సర్దార్‌ చీమకొర్తి(22) నార్సింగి పోలీస్‌ స్టేషన్ ృ పరిధిలో ఓఆర్‌ఆర్‌ సమీపంలో 2023 జనవరి 5న అర్ధరాత్రి దారిదోపిడీ చేస్తూ కత్తితో పొడిచి ఒకరిని హత్య చేశాడు. అక్కడి నుంచి పారిపోయి జగద్గిరిగుట్టలో తలదాచుకున్నాడు. మరుసటి రోజు అతడిని అరెస్టు చేసేందుకు ఎస్‌వోటీ పోలీసులు వెళ్లగా ఇద్దరిపై తల్వార్‌తో దాడి దిగాడు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదైంది. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.

మనసులో పెట్టుకొని దాడి : పోలీసులపై హత్యాయత్నం కేసులో మహిళా జడ్జి బుధవారం (ఈ నెల 12వ తేదీనా) కరణ్‌సింగ్‌కు జీవితఖైదు విధించారు. నార్సింగి హత్య కేసు విచారణ నిమిత్తం పోలీసులు గురువారం మళ్లీ కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితుడు జైలులో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను జడ్జితో చెప్పుకుంటానని అభ్యర్థించాడు. ఆమె అంగీకరించడంతో ఎస్కార్ట్‌ పోలీసులు ఖైదీని జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు. జీవితఖైదు శిక్షను విధించింది మనసులో పెట్టుకుని దగ్గరికి వస్తూనే తన చెప్పును తీసి జడ్డిపైకి విసిరాడు. అనంతరం జడ్జిని, ఆమె కుటుంబం అంతుచూస్తానని బెదిరించాడు. అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన జడ్జి తప్పించుకొని, అక్కడే నిల్చున్నారు.

అప్రమత్తమైన పోలీసులు అతన్ని పక్క గదిలోకి తీసుకెళ్లారు. ఘటనతో ఆవేశానికి లోనైన న్యాయవాదులు కరణ్‌సింగ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో ఎల్బీనగర్‌ ఎస్‌హెచ్‌వో వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత పోలీసులు కరణ్‌సింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం విషయాన్ని మహిళా జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డికి వివరించారు. ఘటనపై న్యాయస్థానం పరిపాలనాధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖండించిన తెలంగాణ న్యాయమూర్తుల సంఘం : కోర్టు హాల్‌లో మహిళా జడ్జిపై ఖైదీ దాడి ఘటనను తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. దీన్ని న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. జ్యుడిషియల్‌ అధికారుల భద్రతలో వైఫల్యం ఏమిటలని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కె.ప్రభాకర్‌ రావు, సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు జిల్లా అదనపు జడ్జి కె.మురళీమోహన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తీర్పులో మానవత్వాన్ని చాటుకున్న జడ్జి - సాక్ష్యం లేక కొట్టేసిన కేసులో బాధితురాలికి పరిహారం

తొలి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికైంది - ఆడపిల్లకు చదువెందుకని హేళన చేసిన వారితోనే శెభాశ్​ అనిపించుకుంది - Meghana Yuva Story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.