AP Officials Remove Illegal Structures : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శివారు ప్రాంతంలో పట్టణానికి ఆనుకుని ఉన్న భూముల్లో ఉన్న గుడిసెలను ఆంధ్రప్రదేశ్ అధికారులు తొలగించారు. ఈ మేరకు రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చి వేయించారు. తెలంగాణలో ఉన్న నిర్మాణాలను ఏపీ అధికారులు తొలగించడమేంటని సందేహం వచ్చిందా? అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఇదీ జరిగింది : భద్రాచలం శివారు ప్రాంతంలో పట్టణానికి ఆనుకొని ఉన్న ఆంధ్రాలో కలిసిన చాలా ఎకరాల ప్రభుత్వ భూములు గత కొంతకాలంగా ఆక్రమణకు గురయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజనలంతా ఆ భూములను ఆక్రమించి గుడిసెలు నిర్మించుకున్నారు. ప్రభుత్వ అధికారులు చాలా కాలం నుంచి భూములను ఖాళీ చేయాలని చెబుతున్నప్పటికీ వినకపోవడంతో ఈరోజు అల్లూరి జిల్లా ఎటపాక మండల అధికారులు గుడిసెలను తొలగించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేయడం ద్వారా గిరిజనులతో పాటు ఇతరులకు అనేక వివాదాలు జరుగుతున్నాయని, ప్రజలెవరూ ప్రభుత్వ భూములను ఆక్రమించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా అక్కడ గిరిజనులు ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేసుకున్న నేపథ్యంలో మండల అధికారులు గుడిసెలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ గిరిజనులు మళ్లీ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయడంతో అధికారులు ప్రొక్లైన్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
మహబూబ్‌నగర్‌లో హైడ్రా తరహా చర్యలు - అక్రమనిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
మణికొండ వైపు దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు - నెక్నాంపూర్లో 5 విల్లాలు నేలమట్టం