Skill Training Of Rural Youth : ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకొనేందుకు వీలుగా అనువైన శిక్షణలను ఇస్తూ ప్రోత్సహిస్తోంది గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే). యువత అన్ని రంగాల్లో రాణించడానికి ప్రధానంగా జీవనాధారమైన వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉపాధి పొందడానికి అవకాశాలు ఉన్న అంశాలపై 3 నుంచి 7 రోజుల వరకు శిక్షణ ఇస్తున్నారు. ట్రైనింగ్‌లో భాగంగా ఉచిత భోజన వసతితోపాటు సౌకర్యాలను కల్పిస్తారు. తాము వినియోగించుకోవడంతో పాటు వాణిజ్యపరంగా మార్కెటింగ్ చేసి ఆదాయం పొందడానికి వీలైన కోర్సులను ప్రతిపాదిస్తోంది గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం.
ఈ శిక్షణకు ఎవరు అర్హులంటే : కనీసం 10వ తరగతి పాసై ఉండి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న 20-25 మంది యువకులు ముందుకు వస్తే వారు కావాలన్న అంశంపై ప్రయోగాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. మార్కెటింగ్ వివరాలతో అనుభవపూర్వకమైన రైతుల క్షేత్రాల సందర్శనతో పలు అంశాలపై శిక్షణను అందిస్తారు.
ఏయే అంశాలపై శిక్షణను అందించనున్నారంటే :
- సేంద్రియ సాగుకు ఉపయోగపడే వర్మీ కంపోస్టు తయారీ- వినియోగం
- శాస్త్రీయ పద్ధతుల్లో ఉద్యాన నర్సరీలు, మల్బరీ తోటలు
- ఆహార పంటల విత్తనాల ఉత్పత్తి లాభసాటి మార్గాలు
- తేనెటీగల పెంపకం, తేనె అమ్మకాలు
- పట్టు పురుగుల పెంపకం, మార్కెటింగ్ ఉపయోగాలు
- సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం
"యువత వ్యవసాయ రంగంలో రాణించేందుకు, ఉపాధి పొందడానికి అవసరమైన శిక్షణను ఇవ్వడంలో ముందంజలో ఉంటాం. నూతన సాంకేతిక అంశాలు, యంత్ర వినియోగం వల్ల లాభాలు, వివిధ ప్రాంతాలలో ఆదర్శంగా నిలిచిన రైతుల అనుభవాల కోసం క్షేత్ర సందర్శనలను ఏర్పాటు చేసి, వారికి నచ్చిన అంశాలలో శిక్షణను ఇస్తున్నాం" - డి.నరేశ్, ప్రోగ్రాం ఇన్‌ఛార్జి, కేవీకే గడ్డిపల్లి
సరికొత్త పంథాలో ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ