ETV Bharat / sports

టీమ్ఇండియా అభిమానులకు షాక్ - ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్​కు బుమ్రా దూరం! - JASPRIT BUMRAH ICC CHAMPIONS TROPHY

ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్​లకు బుమ్రా దూరం! - ఏమైందంటే?

JASPRIT BUMRAH ICC CHAMPIONS TROPHY
JASPRIT BUMRAH (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 12, 2025, 12:42 PM IST

Updated : Jan 12, 2025, 12:49 PM IST

Jasprit Bumrah ICC Champions Trophy 2025 : దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్​లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. టోర్నీకి సంబంధించి గత నెలలోనే షెడ్యూల్ విడుదలైంది. అయితే టీమ్ఇండియా అభిమానులకు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లకు భారత పేసర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల్లో చర్చలు జరుగుతోంది.

అసలేం జరిగిందంటే?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో జస్ర్పీత్ బుమ్రా అదరగొట్టాడు. అయితే, ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వెన్ను నొప్పితో బౌలింగ్ కు దూరం అయ్యాడు. ఆ తర్వాత అతడి గాయంపై పలు వార్తలు వచ్చాయి. అయితే బుమ్రా మార్చి మొదటి వారానికికల్లా గాయం నుంచి కోలుకోవచ్చని తెలుస్తోంది. అప్పటికి 100శాతం ఫిట్​నెస్ సాధించాడని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.

బుమ్రా గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో అతడి పేరును 15 మందితో కూడిన జట్టులో ఉంచాలా? లేదంటే రిజర్వు ఆటగాళ్లలో ఉంచాలా? అన్న విషయాన్ని సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. మార్చి మొదటి వారానికి బుమ్రా ఫిట్ నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా సెలక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

అదరగొట్టిన బుమ్రా
ఆసీస్ గడ్డపై జరగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుతంగా రాణించాడు. అయితే, ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వెన్ను నొప్పితో బాధపడ్డాడు. కాగా, ఈ సిరీస్​లో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​ను దక్కించుకున్నాడు. అలాగే ఈ సిరీస్​లో తొలి టెస్టుకు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ మ్యాచ్​లో భారత్ గెలుపొందింది. సిడ్నీ టెస్టుకు బుమ్రా సారథ్యం వహించగా, ఓటమిపాలైంది.

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్​ను కివీస్​తో ఆడనుంది. కాబట్టి అప్పటికి బుమ్రా రెడీ అవుతాడా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. కివీస్​తో మ్యాచ్‌కు ముందు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్​ను భారత్ ఢీకొట్టనుంది.

ఇంగ్లాండ్​తో T20 సిరీస్​కు జట్టు ప్రకటన- షమీ రీఎంట్రీ, కానీ SRH ప్లేయర్​కు నో ఛాన్స్​!

'అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్'- నాకు తెలిసిన ఫాస్ట్​ బౌలర్ అతడే' ఆసీస్ మాజీ కెప్టెన్ ప్రశంసలు

Last Updated : Jan 12, 2025, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.