ETV Bharat / state

హీరో వెంకటేశ్‌ కుటుంబసభ్యులపై కేసు నమోదు - ఎందుకంటే? - CASE FILED AGAINST HERO VENKATESH

హీరో వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు - దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో కేసు

Case Filed Against Hero Venkatesh And Family
Case Filed Against Hero Venkatesh And Family (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 2:55 PM IST

Updated : Jan 12, 2025, 3:08 PM IST

Case Filed Against Hero Venkatesh And Family : సినీ నటుడు వెంకటేశ్ సహా​ ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. హైదరాబాద్ ఫిల్మ్​నగర్​ దక్కన్​ కిచెన్​ హోటల్​ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్ ​బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఫిల్మ్​నగర్​ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఏం జరిగింది అంటే? : గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బాధితుడిగా ఉన్న నందకుమార్​కు చెందిన దక్కన్ కిచన్ హోటల్​ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం పెరిగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబరులో జీహెచ్​ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్​ను పాక్షికంగా కూల్చివేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

ప్రతి సండే స్టేషన్​కు వెళ్లనక్కర్లేదు - నాంపల్లి కోర్టులో అల్లుఅర్జున్‌కు ఊరట

హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్​ను పూర్తిగా కూల్చేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు శనివారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్​ బాబు, రానా, అభిరామ్​లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాంపల్లిలో 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని, కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

'ఫన్‌ బకెట్‌ భార్గవ్‌’కు 20 ఏళ్ల జైలు శిక్ష - బాలికపై అత్యాచారం కేసులో కోర్టు తీర్పు

Last Updated : Jan 12, 2025, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.