Crew 10 Mission Launch Update: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గత ఎనిమిది నెలలుగా ISSలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నాసా ఇప్పుడు ఆమెతో పాటు తన తోటి వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈ అమెరికా అంతరిక్ష సంస్థ ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సహాయం తీసుకుంటోంది. క్రూ రొటేషన్ పేరుతో నాసా ఈ క్రూ-10 మిషన్ ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో నాసా, స్పేస్‌ఎక్స్ సంస్థలు క్రూ-10ని పంపించేందుకు పాత అంతరిక్ష నౌకను ఉపయోగించాలని నిర్ణయించాయి. అయితే ఇంతకు ముందు ఈ రెస్క్యూ మిషన్ కోసం కొత్త స్పేస్ క్రాఫ్ట్‌ను ఉపయోగించాలని ప్లాన్ చేశాయి.
ప్లాన్‌ను మార్చుకున్న నాసా అండ్ స్పేస్‌ఎక్స్: నాసా వెబ్‌సైట్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. ఈ మిషన్ కోసం క్రూ-10ని మార్చి 12, 2025న ప్రయోగించొచ్చు. అయితే నాసా ఈ తేదీని కూడా మార్చే అవకాశం ఉంది. ఇది ఈ మిషన్ ప్రిపరేషన్స్, ఫ్లైట్ రెడీనెస్ ప్రాసెస్ పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది.
NASA and SpaceX are accelerating the target launch and return dates for the upcoming crew rotation missions to and from @Space_Station.#Crew10 launch now is targeted for March 12, pending mission readiness and completion of flight readiness: https://t.co/MhBNJCL80F pic.twitter.com/ZZs9NltVI5
— NASA Commercial Crew (@Commercial_Crew) February 11, 2025
క్రూ-10తో కొన్ని రోజుల హ్యాండోవర్ పీరియడ్‌ను పూర్తి చేసిన తర్వాత క్రూ-9 ద్వారా ఈ వ్యోమగాములు తిరిగి భూమికి చేరనున్నారు. హ్యాండోవర్ పీరియడ్‌లో అంటే క్రూ-10 టీమ్ ISSకి చేరుకున్న తర్వాత ఇప్పటికే అక్కడ ఉన్న సిబ్బంది నుంచి తమ పని గురించి సమాచారాన్ని పొందుతుంది. ఇవన్నీ అనుకున్నట్లుగానే సవ్యంగా జరిగితే ఇద్దరు సిబ్బంది మధ్య సేఫ్ ట్రాన్సిషన్ జరుగుతుంది.
పాత ప్రణాళిక ఇదే!: సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకురావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ పాత ప్రణాళిక ప్రకారం.. క్రూ-10 కోసం కొత్త డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను లాంఛ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు స్పేస్‌ఎక్స్ ఈ మిషన్ కోసం "ఎండ్యూరెన్స్" అనే పాత డ్రాగన్‌ని పంపాలని నిర్ణయించుకుంది.
అయితే కొత్త డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగానికి సిద్ధం చేసేందుకు మరింత సమయం పడుతుందని, అందుకే పాత వ్యోమనౌకను ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. ప్రణాళికలో ఈ మార్పుతో సునీతా విలియమ్స్, ఆమె తోటి వ్యోమగాములను త్వరగా భూమికి తీసుకురావచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ భావిస్తోంది.
ఇకపోతే ఈ "ఎండ్యూరెన్స్" డ్రాగన్ వ్యోమనౌక ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు అంటే క్రూ-3, క్రూ-5, క్రూ-7 మిషన్లలో ISSకి వెళ్లింది. ఇప్పుడు నాలుగోసారి ఈ స్పేస్‌క్రాఫ్ట్ క్రూ-10తో ప్రయాణించేందుకు సిద్ధమవుతోంది.
క్రూ-10 మిషన్ వ్యోమగాములు వీరే!:
కమాండర్: NASA ఆస్ట్రానాట్ అన్నే మెక్‌క్లైన్
పైలట్: NASA ఆస్ట్రానాట్ నికోల్ అయర్స్
మిషన్ స్పెషలిస్ట్స్: జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)కి చెందిన టకుయా ఒనిషి, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన కిరిల్ పెస్కోవ్.
క్రూ-10 ISSకు చేరుకున్న తర్వాత క్రూ-9లో నాసాకు చెందిన నిక్ హైగ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, రష్యాకు చెందిన అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమికి తిరిగి రానున్నారు. అయితే అంతరిక్షంలో చిక్కుకున్న ఈ వ్యోమగాములు భూమికి తిరిగి ఎప్పుడు వస్తారనే దానిపై మాత్రం నాసా, స్పేస్‌ఎక్స్ ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. అయితే క్రూ-10 మిషన్‌ను మార్చి 12న ప్రయోగిస్తే అదే నెల చివరిలోగా సునీతా విలియమ్స్‌తో సహా ISSలో చిక్కుకున్న వ్యోమగాములందరూ భూమికి తిరిగి వస్తారు.
గీక్‌బెంచ్‌లో శాంసంగ్ అల్ట్రా-స్లిమ్ ఫ్లాగ్షిప్ ఫోన్!- దీని ప్రాసెసర్ గురించి తెలిసిపోయిందిగా!
హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంఛ్- ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!
'స్టార్ట్ బిల్డింగ్ టుడే'- గూగుల్ అతిపెద్ద వార్షిక ఈవెంట్ డేట్ ఫిక్స్!