ETV Bharat / state

రంగరాజన్​పై దాడి కేసు - కిడ్నాప్ చేస్తామని బెదిరించిన వీర్​ రాఘవరెడ్డి గ్యాంగ్ - CHILKUR BALAJI PRIEST ATTACK CASE

బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్​పై దాడి కేసు - 14 మంది అరెస్టు - వీర్​ రాఘవరెడ్డి రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి

Rangarajan Attack Case
Rangarajan Attack Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 9:22 PM IST

Rangarajan Attack Case Updates : చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్​పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ మాట వినకుంటే అపహరిస్తామని, పరిస్థితులు దారుణంగా ఉంటాయని రంగరాజన్​ను నిందితుడు వీర్ రాఘవ రెడ్డి బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే పురోహితులే లక్ష్యంగా చేసుకుని చేసుకుని వీర్ రాఘవ రెడ్డి తిరుగుతున్నాడని, తన భావజాలాన్ని అంగీకరించని వారి అడ్డు తొలగించుకోవాలని ఫాలోవర్లతో ప్రతిజ్ఞ చేయించాడని రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకూ 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో 8 మంది పరారీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్​పై దాడి కేసులో మోయినాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వీర్‌ రాఘవ రెడ్డితో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వీర్ రాఘవ రెడ్డి తూర్పు గోదావరికి చెందిన వాడు కాగా నిజామాబాద్​కి చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణిలను ఈ నెల 8న అరెస్ట్ చేశారు.

తాజాగా శ్రీకాకుళంలో ఐదుగురు, వరంగల్​లో ఒకరు, భద్రాచలంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు. నిందితుల నుంచి దాడి చేసేందుకు వెళ్ళిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వీర్‌ రాఘవ రెడ్డిపై అబిడ్స్​లో లైంగిక వేధింపుల కేసు, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్​లలో సైతం కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా నిందితుల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు పొందుపరిచారు.

గోల్డెన్ టెంపుల్​లో ప్రత్యేక సమావేశాలు : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కొప్పవరానికి చెందిన వీర్ రాఘవ రెడ్డి మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటూ సంగీతం మాస్టర్​గా పని చేస్తున్నాడు. 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంధ్రా పీపుల్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మూసాపేట్​లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించాడు. హిందూ ధర్మాన్ని ఇతర మతాలు నాశనం చేస్తున్నాయని, కోర్టులు పోలీసులు దీనిపై పని చేయట్లేదని, ఇందుకోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలనుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రామ రాజ్య స్థాపనకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ముఖ్యమని తెలిపినట్లు పేర్కొన్నారు. తనకు తాను ముక్కంటి అవతారంగా ప్రచారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ పేజ్, యూట్యూబ్ ఛానెళ్లు ప్రారంభించి భగవద్ఘీత శ్లోకాలు చెప్తూ కొందరు ఫాలోవర్లను సంపాదించుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రామ దండును తయారు చేసేందుకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారం చేశాడని పోలీసులు వెల్లడించారు. రామ దండుకు విరాళాలు సేకరించేందుకు కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఎన్జీవో ఏర్పాటు చేసి, భార్యను ఛైర్మన్​గా పెట్టి తాను అధ్యక్షుడుగా ఉన్నాడన్నారు. తనకు పరిచయం ఉన్న ఉత్తర్ ప్రదేశ్​కి చెందిన శ్యామ్ అనే వ్యక్తి సాయంతో రామరాజ్యం వెబ్​సైట్​ను తయారు చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్​లో తెలిపారు. గతంలో మణికొండ గోల్డెన్ టెంపుల్​లో ప్రత్యేక సమావేశాలు వీర్ రాఘవ రెడ్డి ఏర్పాటు చేశాడని, రాజ్యాగంలో ఆర్టికల్ 25, 30 గురించి ప్రసంగాలు ఇచ్చినట్లు తెలిపారు.

దాడి వీడియోలు ఫేస్​బుక్​లో ప్లోడ్ : రామ దండుకు మనుషులను రిక్రూట్ చేసే విషయమై తొలిసారి రాఘవేందర్ అనే వ్యక్తి సాయంతో చిలుకూరి బాలాజీ అర్చకులు రంగరాజన్​ను వీర్ రాఘవ రెడ్డిని కలవగా ఆయన స్పందించలేదని రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1నుంచి డిసెంబర్ 31లోపు తన సైన్యంలో చేరిన వారికి నెలకు 20వేల జీతం ఇస్తానని వీర్ రాఘవ రెడ్డి ప్రచారం చేసినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో 21 మంది ఆయన్ని కలిసి సైన్యంలో చేరానని తెలిపారు. వీరంతా గత నెల 25న ఆంధ్రప్రదేశ్ పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు. అక్కడ తాము చేయాల్సిన పనిపై ప్రమాణం చేయించాడని తెలిపారు. అనంతరం ఈ నెల 4న వీర్ రాఘవ రెడ్డి స్నేహితుడు న్యాయవాది అయిన దామోదర్ రెడ్డి సహాయంతో కాప్రా దమ్మాయిగూడలోని ఉదయ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో నిందితులు అంతా సమావేశం అయ్యారన్నారు.

అక్కడ రంగరాజన్ వద్దకు వెళ్లే విషయమై మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులకు తలో రెండు వేలు ఇచ్చిన యూనిఫామ్ కుట్టించుకున్న తర్వాత ఈ నెల 6న మరోసారి అదే ప్రదేశంలో కలిసి ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 7న ఉదయం 8గంటల సమయంలో రంగరాజన్ ఇంటికి మూడు కార్లలో వెళ్లారు. వారిని చూసిన రంగరాజన్, స్నానానికి వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్తామని, పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించారన్నారు. దాడి చేసి వీడియోలను ఫేస్ బుక్ పేజ్​లో అప్లోడ్ చేశారని రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు.

దాడి కేసులో పరారీలో ఉన్న మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రేపు వీర్ రాఘవ రెడ్డి కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.

చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్​పై దాడి - ఆలస్యంగా వెలుగులోకి

'స్వామివారి సేవలో నిమగ్నమైన వారిని అవమానించడం అంటే - ఆ దేవుడిని కూడా అవమానించినట్లే'

రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ - దాడి కేసులో ఆరుగురి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.