Natural Beauty Tips in Telugu : ఎవరికైనా సరే అన్ని వేళల్లోనూ అందంగా కనిపించాలనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పండగ, ఫంక్షన్, పార్టీ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇంకాస్త ట్రెండీగా కనిపించాలనుకుంటారు చాలా మంది. ఈ క్రమంలోనే సరదాలు పంచే సంక్రాంతి వేళ మంచి లుక్‌తో మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే, మీకోసం కొన్ని నేచురల్ బ్యూటీ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే పండగ వేళ ఇంటి ముంగిట రంగవల్లుల మాదిరిగా మీరూ అందంగా మెరిసిపోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ, ఆ బ్యూటీ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అందంగా కనిపించాలంటే చర్మం మీద పేరుకుపోయే మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో ఫేషియల్ చేయించుకోవడంతో పాటు త్రెడింగ్ ద్వారా కనుబొమ్మల్ని కూడా షేప్ చేసుకోవాలి. అయితే, పండగ ముందుగా ఎంత సన్నద్ధమైనా పొంగల్ రోజు మరింత గ్లోయింగ్ లుక్‌తో కనిపించాలంటే ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
తేనె, నిమ్మరసంతో : నిమ్మ, తేనె వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాదు సౌందర్యపరంగానూ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలోనే తేనె, నిమ్మరసంతో ఇలా ఫేస్ ప్యాక్ ట్రై చేసినా గుడ్ రిజల్ట్ పొందవచ్చంటున్నారు. అందుకోసం ఒక చిన్న గిన్నెలో సమాన పరిమాణంలో తేనె, నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ఆపై శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుంటే చాలు. నిమిషాల్లో మెరిసిపోయే చర్మం మీ సొంతమవుతుందంటున్నారు.
టమాటాతో గ్లోయింగ్ స్కిన్! : నిత్యం వివిధ వంటకాలలో వాడే టమాటాను ఉపయోగించి కూడా కాంతివంతంగా మారిపోవచ్చు. దానికోసం ముందుగా టమటాని ముక్కలుగా కోసి దాని గుజ్జుతో ముఖమంతా రుద్దుకోవాలి. అలా 15 నిమిషాల పాటు ఆరనిచ్చి అనంతరం ముఖం కడుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇవేకాకుండా ఐస్‌క్యూబ్‌తో ముఖం రుద్దుకున్నా సరే చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించుకోవచ్చంటున్నారు నిపుణులు.
మేకప్ ఇలా వేసుకోండి!
- ముందుగా మీ డ్రస్సింగ్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి.
- ఇందుకోసం ముందుగా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే పెదాలకు లిప్‌బామ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా దొండపండులా నిగనిగలాడుతూ కనిపిస్తాయి.
- అనంతరం మాయిశ్చరైజర్‌ని స్కిన్‌లోకి ఇంకిపోయేలా స్మూత్‌గా రుద్దాలి. ఆపై ప్రైమర్ రాసి, మీ చర్మం రంగుకి సరిపడే ఫౌండేషన్‌ను అప్త్లె చేసుకోవాలి.
- ఒకవేళ కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఉంటే వాటిని కన్సీలర్‌తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖమంతా పౌడర్‌తో లైట్‌గా టచప్ ఇచ్చుకోవాలి.
- ఇక మీకు లిప్‌స్టిక్ వాడే అలవాటు ఉంటే పెదాలకు నప్పే రంగు లిప్‌స్టిక్ వేసుకుంటే చాలు మంచి లుక్ మీ సొంతం అవుతుందంటున్నారు.
హెయిర్‌స్త్టెల్ విషయంలో ఇలా చేయండి!
ఫెస్టివల్స్ టైమ్‌లో చాలా మంది ఎక్కువగా లూజ్ హెయిర్‌తోనే కనిపించాలని అనుకుంటుంటారు. అలాకాకుండా మీరు ఎంచుకున్న డ్రస్సింగ్ ప్రకారం మీకు నప్పే హెయిర్ స్టైల్ ఎంచుకోవడం మంచిది. కావాలనుకుంటే హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేసి మరింత ఆకర్షణీయంగా రడీ అవ్వొచ్చంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం!
హైట్ తక్కువగా ఉన్నారా? - ఇలా చీర కట్టుకుంటే లుకింగ్ గార్జియస్ - పైగా ఎత్తు కనిపిస్తారట!