ETV Bharat / offbeat

"వంకాయ With కందిపప్పు ఇగురు" - గుంటూరు స్పెషల్ గురూ - వేడి వేడి అన్నంలో అమృతమే! - VANKAYA PAPPU IGURU RECIPE

- అమ్మమ్మల కాలం నాటి అద్భుత రెసిపీ - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

VANKAYA PAPPU IGURU
Brinjal Dal Fry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 5:59 PM IST

Brinjal Dal Fry Recipe in Telugu : ఎప్పుడూ రొటీన్ రెసిపీలే కాకుండా ఓసారి ఇలా "వంకాయ కందిపప్పు ఫ్రై" ట్రై చేయండి. అమ్మమ్మల కాలం నాటి ఈ కమ్మటి వంకాయ కూర ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. తెలిసీతెలియని పులుపుతో, కమ్మని కొబ్బరి పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ కర్రీ. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో దీన్ని తింటుంటే కలిగే ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. అలాగే, పండగల టైమ్​లో ఉల్లి, వెల్లుల్లి తినని వారికీ ఇది బెస్ట్ రెసిపీగా నిలుస్తుంది. మరి, ఈ సూపర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - అరకిలో
  • కందిపప్పు - పావు కప్పు
  • చింతపండు - ఉసిరికాయ సైజంత
  • పచ్చిమిర్చి - కారానికి తగినన్ని
  • పచ్చికొబ్బరి ముక్కలు - అరకప్పు
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • మినపప్పు - 1 టేబుల్​స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఈ పొడి కాస్త వేసి "వంకాయ ముద్ద కర్రీ" చేయండి - గుత్తి వంకాయను మించిన టేస్ట్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి, ముప్పావు కప్పు వరకు వాటర్ పోసి గంటకు పైగా నానబెట్టుకోవాలి.
  • ఇక్కడ మీరు కందిపప్పుకి బదులుగా పెసరపప్పు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు. అలాగే, చింతపండుని నానబెట్టుకోవాలి.
  • కందిపప్పు నానేలోపు రెసిపీలోకి కావాల్సిన నీలం రంగు పొడవు వంకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై రెండు అంగుళాల పొడవుతో ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక గిన్నెలో 400ఎంఎల్ వరకు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు నుంచి తీసిన అర కప్పు పులుసు యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి.
  • ఆ తర్వాత మూతపెట్టి హై-ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే, వంకాయ ముక్కలు చింతపండు నీటిలో 80% వరకు ఉడకాలి. అంతేకానీ, మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక వంకాయ ముక్కలను వాటర్ వడకట్టి ఒక బౌల్​లో వేసి పక్కనుంచాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, సన్నని పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేపుకోవాలి.
  • తాలింపు వేగాక అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టిన కందిపప్పుని వాటర్ వడకట్టి వేసుకొని నెమ్మదిగా గరిటెతో కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో గరిటెతో నెమ్మదిగా కలుపుతూ కందిపప్పు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి.
  • ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్ర స్పెషల్ "వంకాయ కందిపప్పు ఫ్రై" రెడీ!

నోరూరించే తెలంగాణ స్టైల్ "వంకాయ పచ్చికారం" - వేడివేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి కిర్రాక్ కాంబినేషన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.