Oppo Reno 13 5G vs Oppo Reno 13 Pro 5G: ఒప్పో ఎట్టకేలకూ తన రెనో 13 సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఈ లైనప్ నవంబర్ 2024లో చైనాలో ప్రారంభమైంది. తాజాగా కంపెనీ ఈ సిరీస్‌ను భారత్‌లో కూడా లాంఛ్ చేసింది. ఇందులో ఒప్పో రెనో 13 5G, ఒప్పో రెనో 13 ప్రో 5G అనే రెండు మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లూ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్తో రన్ అవుతాయి.
అంతేకాక ఇవి 50MP సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు పరికరాలు 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ వంటి వివరాలు తెలుసుకోవడం కోసం వీటి కంపారిజన్ మీకోసం. వీటి ఆధారంగా ఈ రెండింటిలో ఏ మోడల్ మీకు సరైనదో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఒప్పో రెనో 13 5G vs ఒప్పో రెనో 13 ప్రో 5G: స్పెసిఫికేషన్లు
డిస్ప్లే: ఒప్పో రెనో 13 ఫోన్లో 6.59-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ అమోలెడ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
అదే సమయంలో ఒప్పో రెనో 13 ప్రో 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లకు ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉందని కంపెనీ పేర్కొంది.
సాఫ్ట్‌వేర్: ఈ రెండు మోడల్ పరికరాలు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15 పై నడుస్తాయి.
ర్యామ్ అండ్ స్టోరేజ్: ఒప్పో రెనో 13 5G, ఒప్పో రెనో 13 ప్రో 5G రెండూ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌పై నడుస్తాయి. వీటిని 12GB LPPDR5X RAM అండ్ 512GB వరకు UFS 3 స్టోరేజ్‌తో అందించారు.
కెమెరా సెటప్: రెండు మోడళ్లలో 50MP సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటితో పాటు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. రెనో 13 5G లోని మూడో సెన్సార్ 2MP మోనోక్రోమ్ సెన్సార్, అయితే ప్రో మోడల్ 50MP JN5 టెలిఫోటో సెన్సార్ అనేది 3.5x ఆప్టికల్ జూమ్, 120x వరకు డిజిటల్ జూమ్‌తో వస్తుంది.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: స్టాండర్డ్ మోడల్ 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఒప్పో రెనో 13 ప్రో మోడల్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇతర ఫీచర్లు: కొత్త రెనో సిరీస్ 5G కనెక్టివిటీ, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో IP66 + IP68 + IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఒప్పో కస్టమ్-డెవలప్డ్, సిగ్నల్‌బూస్ట్ X1 నెట్‌వర్క్ చిప్ మెరుగైన సిగ్నల్ కవరేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఒప్పో రెనో 13 5G vs ఒప్పో రెనో 13 ప్రో 5G:
ఒప్రో రెనో 13 5G వేరియంట్స్:
- 8GB + 128GB
- 8GB + 256GB
ఒప్రో రెనో 13 5G ధరలు: ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ.37,999 నుంచి ప్రారంభమవుతుంది. దీని 8GB + 256GB వేరియంట్ ధర రూ.39,999.
కలర్ ఆప్షన్స్:
- లూమినస్ బ్లూ
- ఐవరీ వైట్ కలర్
ఒప్రో రెనో 13 ప్రో 5G వేరియంట్స్:
- 12GB RAM + 256GB
- 12GB + 512GB
ఒప్రో రెనో 13 ప్రో 5G కలర్ ఆప్షన్స్:
- గ్రాఫైట్ గ్రే
- మిస్ట్ లావెండర్
ఒప్రో రెనో 13 ప్రో 5G ధరలు: ఒప్పో రెనో 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.49,999 నుంచి ప్రారంభమవుతుంది. దీని 12GB + 512GB వేరియంట్ ధర రూ.54,999.
ఈ రెండు డివైజ్‌లు జనవరి 11, 2025 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
మార్కెట్లో ఒకేసారి 3 కార్లు లాంఛ్- ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!- ధర కూడా రూ.5 లక్షల లోపే!
కొత్త నంబర్ల నుంచి మిస్డ్కాల్స్ వస్తున్నాయా?- తిరిగి చేశారో ఇక అంతే!- అలాంటి సమయంలో ఏం చేయాలంటే?